పటాన్‌కోఠ్‌ ఉగ్రదాడి.. ఎన్‌ఎస్జీ కమాండోకు రూ.10లక్షల సాయం

 

పంజాబ్ పఠాన్ కోట్ లో ఉగ్రవాదులు చొరబడి విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు పటాన్‌కోఠ్‌ ఉగ్రదాడిలో గాయపడ్డ శ్రీకాకుళం జిల్లా ఎన్‌ఎస్జీ కమాండో శ్రీరాములుకు ఏపీ ప్రభుత్వం సాయం అందించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా శ్రీరాములని అతని నివాసంలో కలిసి రూ.10లక్షల చెక్ ను అందజేశారు. సీఎంఓలో అధికారులు, కుటుంబ సభ్యులతో వచ్చి సీఎం చంద్రబాబును శ్రీరాములు కలిశారు. శ్రీరాములు పరిస్థితి చూసి చలించిన సీఎం.. అప్పటికప్పుడు రూ.10లక్షల సహాయం ప్రకటించి ఇంటి స్థలం మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కాగా గత జనవరిలో పఠాన్‌కోట్‌ ఎయిర్‌బేస్‌లో పాక్‌ ఉగ్రవాదుల దాడి తర్వాత బాంబు నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలడంతో శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డారు. కోమాలోకి వెళ్లిన ఆయన ఇటీవలే కోలుకున్నారు.