మౌనం వీడిన ముఖ్యమంత్రి

 

కేంద్ర తెలంగాణ ప్రక‌ట‌న చేసిన త‌రువాత తొలి సారిగా ముఖ్యమంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి నోరు విప్పారు. రాష్ట్ర విభ‌జ‌నపై ఎవ‌రికి ఎలాంటి అభ్యంతరాలు ఉన్న ఆంటోని క‌మిటీకి నివేదించుకోవాలి అన్నారు. దీంతోపాటు స‌మైక్యాంద్ర కొసం స‌మ్మె బాట ప‌ట్టిన ఉద్యోగుల‌ను స‌మ్మె విర‌మించుకోవాల‌ని కోరారు. ఇలాంటి చ‌ర్యల వల్ల ఇరు ప్రాంతాల ప్రజ‌లు తీవ్రంగా న‌ష్టపోవాల్సి వ‌స్తుంద‌న్నారు.

సీమాంద్ర లో జాతీయ నాయ‌కులు విగ్రహాల కూల్చివేతపై సీయం సీరియ‌స్ అయ్యారు ఇలాంటి ప‌నుల‌తో స‌మ‌స్య మ‌రింత పెద్దదుతుందే కాని ప‌రిష్కారం దొర‌క‌ద‌ని చెప్పారు.విధ్వంసాలకు పాల్పడే వారిపై కఠిన వైఖరి అవలంభిస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతల విషయంలో తమ ప్రభుత్వం కచ్చితంగా, కఠినంగా ఉంటుందని స్పష్టం చేశారు.

కేంద్ర ప్రక‌ట‌నపై స్పందించిన సియం సిడ‌బ్ల్యూసి ప్రక‌ట‌న తాను ఖండించ‌టం లేదు అంటూనే స‌మ‌ర్ధించ‌టం కూడా లేద‌న్నారు.. వ్యక్తిగ‌తంగా ఇప్పటికీ తాను స‌మైక్య వాదినే అన్నారు. విభ‌జ‌న విష‌యంలో అన్ని పార్టీలు దొంగ‌నాట‌కాలు ఆడుతున్నాయి అన్న కిర‌ణ్ విభ‌జ‌న విష‌యం ఇంకా కాంగ్రెస్ పార్టీ వ‌ద్దే ఉంద‌న్నారు.ఉద్యమాల కోసం ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.