చాక్లెట్లు తింటే బరువు తగ్గుతారా?

 

బరువు తగ్గాలంటే అవి తినొద్దు... ఇవి తినొద్దు అంటుంటారు కదా... అయితే తియ్యని చాక్లెట్లు తింటూ బరువు తగ్గండి అంటున్నారు పరిశోధకులు. చాక్లట్లకు, శరీర మాస్ ఇండెక్స్‌కు సంబంధం వుందని, వారంలో ఐదుసార్లు చాక్లెట్లు తినేవారు చాక్లెట్లు తిననివారి కంటే బరువు తగ్గే అవకాశం ఎక్కువని చెబుతున్నారు వీరు. కోకోలోని పాలిఫెనాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ మెటబాలిజం పనితీరును మెరుగుపరచడమే అందుకు కారణమట. అయితే ఒక కండీషన్.. రోజుకు 30 గ్రాములకు మించి తింటే క్యాలరీల కౌంట్ పెరుగుతుంది కాబట్టి మితంగా తినాలి. అలాగే మంచి నీరు కూడా ఎక్కువగా తాగితే క్యాలరీల ఖర్చు కూడా పెరుగుతుంది. వీలయినప్పుడల్లా ఓ గ్లాసుడు నీళ్ళు తాగితే చాలు... తెలీకుండా బరువు తగ్గిపోతారుట.

-రమ