మీసాలు తీయడానికి అసలు కారణం అది!

మీడియాకు పాజిటీవ్ థికింగ్ అనేదే ఉండటంలేదబ్బా. ప్రతిదానికీ నెగిటీవ్ గా ఆలోచించడమే. పాపం... చిరంజీవి గారు మీసాలు తీసేశాడు. అంతే.. చిరంజీవి మీసాలు ఎందుకు తీశాడు? సైరా నరసింహారెడ్డి చిత్రం షూటింగ్ ఆగిపోయిన మాట నిజమేనా? దర్శకుడ్ని మార్చేస్తున్నారా? నయనతార కూడా ఈ సినిమా నుంచి తప్పుకుందా? ఇలా... వారి ప్రశ్నలన్నీ జనాలమీద రుద్ది.. వాళ్లకు కూడా లేనిపోని అనుమానాలు కల్గిస్తున్నారు మీడియా ప్రముఖులు. నిజానికి ‘సైరా’ షూటింగ్ కి కాస్త గ్యాప్  ఇచ్చారంతే.

దర్శకుడ్ని మార్చడం అనేది శుద్ధ అబద్ధం. దానికి సురేందర్ రెడ్డే దర్శకుడు. రచయితలకూ, సురేందర్ రెడ్డికీ మధ్య కాస్త అభిప్రాయబేధాలు తలెత్తిన మాట నిజం. అయితే.. ఆ గొడవ కూడా సద్దుమణిగింది. ఇక షూటింగ్ కి గ్యాప్ ఇవ్వడానికి కారణం... గ్రాఫికల్ వర్క్. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన గ్రాఫికల్ వర్క్ ని మొదలుపెట్టారు. చిరంజీవి మీసాలు తీసేయడానికి కారణం కూడా అదే. ఆయప ముఖంగా సీజీ వర్క్ జరగాల్సి ఉంది. అందుకు మీసాలుండకూడదు.  అందుకే... మెగాస్టార్ మీసాలు తీశారు. దానికి సవాలక్షా అబద్ధాలు కలుపుకొని  న్యూస్ లు రాసేశాయ్ చానళ్లన్నీ. అంతేకాదు... నయనతార ఈ సినిమా నుంచి తప్పుకున్న మాటలో కూడా నిజం లేదు. ఇందులో నయనే కథానాయిక. అదన్నమాట విషయం.