కాంగ్రెస్‌కి భారమైపోయిన చిరంజీవి!

 

 

 

పెద్దవాళ్ళు ఏదైనా పని చేస్తుంటే కాళ్ళకి అడ్డం పడే పిల్లలు వుంటారు చూశారా... ప్రస్తుతం సీమాంధ్ర కాంగ్రెస్‌లో చిరంజీవి పరిస్థితి అలాగే వుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సీమాంధ్రలో నిండా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీని చిరంజీవి తన గ్లామర్‌తో పైక తేలుస్తారని కాంగ్రెస్ అధిష్ఠానం భావించింది. అయితే చిరంజీవి నుంచి అలాంటి మేలు కొంత అయినా జరిగిన దాఖలాలు ఇప్పటి వరకూ కనిపించడం లేదు. పార్టీ అంతర్గత మీటింగ్స్ లో ఆవేశంగా మాట్లాడ్డం తప్ప ప్రజలను కాంగ్రెస్ వైపు మళ్ళేలా చిరంజీవి చేయలేకపోతున్నారని కాంగ్రెస్‌ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం.

 

కాంగ్రెస్ పార్టీకి బలంగా వుంటారని చిరంజీవి పార్టీని కాంగ్రెస్ పార్టీ తనలో విలీనం చేసుకుంది. చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి ఇవ్వడంతోపాటు ఆయనతో పాటు పార్టీలో చేరిన ఎమ్మెల్యేలని తగిన రీతిలో గౌరవించింది. అయితే చిరంజీవి వెంట వచ్చిన ఎమ్మెల్యేలలో దాదాపు అందరూ కాంగ్రెస్ పార్టీని  విడిచి వెళ్ళిపోయారు. చిరంజీవి కనీసం వాళ్ళని ఆపే విషయంలో కూడా ఫెయిలైపోయారు. చిరు వర్గం ఎమ్మెల్యేలు పోతే పోయారు చిరంజీవి గ్లామర్ అయినా పార్టీకి ఉపయోగపడుతుందన కాంగ్రెస్ అనుకుంటే, ఆయనగారి మీటింగ్స్ కి జనలే కరువైపోతున్నారు.


సరే ఈ విషయంలో కూడా సరిపెట్టుకుందాం. చిరంజీవి పార్టీ అభివృద్ధికి ఏవైనా మంచి సలహాలు ఇస్తారా అంటే, రాజకీయ అనుభవ శూన్యుడైన చిరంజీవి పాలిటిక్స్ ట్రిక్స్ దేనినీ ప్రదర్శించలేకపోతున్నారు. మొత్తమ్మీద సీమాంధ్ర కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న సమావేశాల్లో పాల్గొని సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీ సూపర్‌గా వుందని అనడం తప్ప ఆయన చేస్తున్నదేమీ లేదు. ఇలాంటి చిరంజీవి తమ కాళ్ళకు అడ్డు పడిపోవడం తప్ప పార్టీని బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలేవీ లేవని  సీమాంధ్ర కాంగ్రెస్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.