చట్టాలు మారాలి.. అత్యాచారానికి పాల్పడితే చంపేయాలి: చినజీయర్

 

హైదరాబాద్ పుప్పాలగూడలోని మైహోమ్ అపార్ట్ మెంట్ లో భూవరాహస్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. త్రిదండి చినజీయర్ స్వామి చేతుల మీదుగా శ్రీ భూవరాహస్వామి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ మహాకుంభాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జీయర్ స్వామితో పాటు మైహోం అధినేత జూపల్లి రామేశ్వరరావు కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖుల వైదిక కార్యక్రమానికి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు సంప్రోక్షణ నిర్వహించారు స్వామి. భగవంతుడి విగ్రహానికి ఎంతో శక్తి ఉందన్నారు ఆయన తెలియజేశారు.భగవంతుడు విగ్రహ రూపొందించే భక్తులను కరుణిస్తాడని చెప్పారు.భగవంతుడు ఒక్క సారి కన్ను రెప్ప వేసి తీసేటప్పటికీ కొన్ని వందల మంది గడిచిపోతారని.. మధ్యాహ్నం వేళ కళ్యాణం చేసుకుంటున్నామంటే భగవంతుని అంగీకారమేనని ఆయన ప్రసంగంలో తెలిపారు. భగవంతుడు కదిలితే సాధారణ మనుషులు ఎవ్వరూ కూడా తట్టుకోలేరని ప్రసంగించారు.

మరో వైపు దిశా ఘటన పై కూడా స్పందించారు చినజీయర్ స్వామి. కాలం చెల్లిన చట్టాలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆడవాళ్ళ మీద అత్యాచారాలకు పాల్పడే వాళ్లకు కఠిన శిక్షలు విధించినప్పుడే ఇలాంటి ఘటనలు పునరావృతం కావన్నారు. బాధితురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ భగవంతుడు వారికి ఎప్పుడు ధైరం చేకూర్చాలని ప్రసంగించారు చినజీయర్ స్వామి.