విభ‌జ‌న ప్రక్రియ మొద‌లైంది

 

రాష్ట్రంలో స‌మైక్య సెగ‌లు ఏ స్థాయిలో ఉన్నా కేంద్ర మాత్రం త‌న పని తాను చేసుకు పోతుంది. ఇప్ప‌టికే రాష్ట్ర‌విభ‌జ‌న ప్రక్రియ మొద‌లైన‌ట్టుగా ప్రక‌టించారు కేంద్రమంత్రి చిదంబ‌రం. కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు ముందుగా అనేక అంశాల‌ను చ‌ర్చించాల్సి ఉంటుంద‌ని చెప్పిన చిదంబ‌రం ఆ దిశ‌గా ప్రయ‌త్నాలు మొద‌లు పెట్టామ‌న్నారు.ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం రాజ్యస‌భ‌లో ఒక ప్రక‌ట‌న చేశారు. తెలంగాణ అంశానికి సంభందించిన త్వ‌ర‌లోనే కేంద్ర హోం శాఖ ఓ విధాన ప‌త్రాన్ని కేభినేట్ ముందు ఉంచుతుంద‌రి చెప్పారు.

కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు సంభందించి రాజ్యంగంలో కొన్ని విధి విదానాలు ఉన్నాయ‌న్న చిదంబ‌రం ఆ అంశాల‌తో కూడిన నోట్ సిద్దం చేస్తున్నట్టుగా చెప్పారు. ఈ నోట్‌లో విద్యుత్. న‌దీ జ‌లాల పంపిణీ, ప్రజ‌ల భ‌ద్రత లాంటి అంశాల‌ను కూడా ప్రస్థావించ‌నున్నట్టు తెలిపారు.

ముందుగా తాము త‌యారు చేసిన బిల్లు కేభినేట్ ఆమోదానికి వెలుతుంద‌ని. ఆత‌రువాత ఏర్పాడే మంత్రి వ‌ర్గ ఉప‌సంఘంతో అన్ని ప్రాంతాల వారు త‌మ అభిప్రాయాల‌ను చెప్పుకోవ‌చ్చన్నారు. దీంతో పాటు ఈ నోట్ పై కేంద్ర ఉభ‌య స‌భ‌ల్లో చ‌ర్చ‌కు అవ‌కాశం క‌ల్పిస్తామ‌న్నారు.