ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2014-2015 ముఖ్యాంశాలు

 

 

 

సామాన్యునికి ముందుంది బంగారు భవిష్యత్తు అనే భరోసా ఇస్తూ ఆర్థిక శాఖ మంత్రి పి.చిదంబరం 2014-2015వ సంవత్సరానికి సోమవారంనాడు పార్లమెంటులో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర సరకుల ధరలు త్వరలోనే దిగివస్తాయని ఆయన హామీ ఇచ్చారు. రక్షణ శాఖకు, కుటుంబ సంక్షేమానికి, విద్య, వ్యవసాయ రంగాలకు పెద్ద పీట వేస్తున్నట్టు ఆయన తమ బడ్జెట్‌లో పేర్కొన్నారు.

చిదంబరం బడ్జెట్ ముఖ్యాంశాలు:

1. ద్రవ్యలోటు 4.6 శాతానికే పరిమితమైంది
2. జనవరి చివరినాటికి ద్రవ్యోల్బణం 5.5 శాతం ఉంది
3. 2013-2014 నాటికి 225 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరిగింది
4. 2014 లో 263 మిలియన్ టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి అంచనా
5. 2013-2014లో 7 లక్షల 35కోట్ల వ్యవసాయ రుణాలు అందించాం
6. 2012-2013లో 326 బిలయన్ డాలర్ల ఎగుమతి జరిగింది.
7. దేశంలో మరో మూడు తయారీరంగ పారిశ్రామిక జోన్లు
8. 2011-2012 ఆర్థిక సంవత్సరం నుంచి మందగమనం ప్రారంభమైంది.
9. పదేళ్లక్రితం దేశం మొత్తం విద్యుత్ ఉత్పత్తి లక్ష 20 వేల మెగావాట్లు.
10. ప్రస్తుతం 2లక్షల 44వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి పెరిగింది
11. ఉన్నత విద్యకు 79,459 కోట్లు కేటాయింపు
12. వైద్యరంగానికి 36,300 కోట్లు కేటాయింపు
13. 1999-2004 నాటికి జీడీపీ వృద్ధి రేటు 5.9 శాతం
14. 2004-2009 నాటికి జీడీపీ వృద్ధి రేటు 8.4 శాతం
15. చక్కెర పరిశ్రమలపై నియంత్రణలను పూర్తిగా తొలగించాం
16. డిజిల్ ధరలను మార్కెట్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాం
17. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా 67 శాతం ప్రజలకు ఆహార భద్రత అందిస్తున్నాం
18. దేశంలో 50 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి
19. విదేశీ పెట్టుబడులకు సానుకూల వాతావరణం కల్పించాం
20. ఫార్మా, విమానయాన, మల్టీబ్రాండ్, రిటైల్‌రంగంలో నిబంధనలు సరళతరం చేశాం
21. 45 బిలియన్ డాలర్లుగా కరెంట్ ఖాతా లోటు ఉంది.
22. వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు అంచనా 5.2శాతం
23. 2013-2014 మూడు, నాలుగు త్రైమాసికాల్లో ఆర్థిక వ్యవస్థ కోలుకుంది
24. ఈశాన్య రాష్ర్టాలైన హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు 12 వేల కోట్లు అదనపు కేటాయింపు
25. అంతరిక్ష పరిశోధనల్లో ఇస్రోకు అదనపు సాయం.
26. రూ.1000 కోట్లతో నిర్భయ ఫండ్
27. యూపీఏ సగటు వద్ధి రేటు సూచీలు ఎన్‌డీఏ హయం కంటే మెరుగ్గా ఉన్నాయి
28. జాతీయ నైపుణ్య అభివద్ధి పథకానికి రూ. 1000 కోట్లు
29. 27 పథకాల ద్వారా ప్రత్యక్ష నగదు బదిలీ పథకం ప్రవేశపెట్టాం
30. ఆధార్‌కు ప్రభుత్వం కట్టుబడే ఉంది.
31. ఇప్పటి వరకు 57 కోట్ల మంది ఆధార్‌లోకి వచ్చారు.
32. 2013-2014 నాటికి వద్ధిరేటు అంచనా 4.9 శాతం.
33. 2014-2015లో రూ. 5 లక్షల 55 వేల 333 కోట్లుగా ప్రణాళిక వ్యయం