చంద్రకళ.. షార్ట్ - స్వీట్ రివ్యూ...

 

తారాగణం: ఆండ్రియా, హన్సిక, సుందర్‌ సి., వినయ్‌, సంతానం, రాయ్‌ లక్ష్మి, కోట శ్రీనివాసరావు, కోవై సరళ తదితరులు.

 

 నిర్మాణం: శ్రీ శుభశ్వేత ఫిలింస్‌, కథనం: ఎస్‌.బి. రామదాస్‌, సంగీతం: భరద్వాజ్‌, నేపథ్య సంగీతం: కార్తీక్‌ రాజా, కూర్పు: ఎన్‌.బి. శ్రీకాంత్‌, ఛాయాగ్రహణం: యు.కె. సెంథిల్‌ కుమార్‌, నిర్మాతలు: శ్వేతలాన, వరుణ్‌, తేజ, సి.వి. రావు, కథ, దర్శకత్వం: సుందర్‌ సి.

 

ఖుష్బూ భర్త సుందర్ సి. తమిళంలో రూపొందించిన ‘అరన్‌మనై’ సినిమాని తెలుగులోకి ‘చంద్రకళ’గా అనువదించారు. ఇది పూర్తి స్థాయి హారర్ కామెడీ సినిమా. ఎంతోకాలంగా పాడుబడి వున్న ఒక భారీ భవంతిని అమ్మేయాలన్న ఉద్దేశంతో ఆ భవంతి ఓనర్లు ప్రయత్నిస్తూ వుంటారు. ఆ భవంతిని శుభ్రం చేయించాలని అక్కడకి వస్తారు. అయితే భవంతిలో పనిచేస్తున్న పనివాళ్ళు ఒక్కరొక్కరే మాయమౌతూ వుంటారు. అందరూ అనుకుంటున్నట్టుగా ఆ భవంతిలో దయ్యం తిరుగుతూ, జనాన్ని మాయం చేస్తోందా.. లేక నిజంగానే దెయ్యం వుందా అనేది ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి హన్సిక కాదు.. ఆండ్రియా. ‘చంద్రకళ’ పాత్ర హన్సిక ధరించినప్పటికీ కథంతా ఆండ్రియా చుట్టూనే తిరుగుతుంది. ఆండ్రియా నటనతో, గ్లామర్‌తో నచ్చుతుంది. హారర్, కామెడీ మేళవింపుగా వున్న ఈ సినిమా చివరి పదిహేను నిమిషాలు ఆకట్టుకుంటుంది.