'వస్తున్నా మీకోస౦' ముగింపు

 

 

chandrabbau padayatra, chandrababu vastunna meekosam, tdp padayatra

 

 

'వస్తున్నా మీకోస౦' అంటూ గత ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతిన మొదలు పెట్టిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర ఈ రోజుతో ముగియనుంది. ఏడు నెలల పాటు సుధీర్ఘంగా సాగిన పాదయాత్రతో చంద్రబాబు చరిత్ర సృష్టించాడు. ఏకధాటిగా 2800 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నేతగా రికార్డుల కెక్కారు. పాదయాత్ర ముగింపుకు పార్టీ నేతలు భారీగా ఏర్పాట్లు చేశారు. విశాఖలో నేడు పాదయాత్ర ముగింపు పైలాన్ ను ఆవిష్కరించి, ఆ తరువాత అక్కడి బహిరంగ సభలో ప్రసంగించి చంద్రబాబు రేపు ఉదయం విశాఖలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ ప్రారంభిస్తారు.

 

గడచిన ఏడు నెలలుగా ఇంటి మొహం చూడకుండా 16 జిల్లాలలో పాదయాత్ర చేశారు. రేపు మధ్యహ్నం విశాఖలో బయలుదేరి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ బాబుకు ఘనస్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఒకరోజు విశ్రాంతి అనంతరం చంద్రబాబు తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తరువాత స్వగ్రామం నారావారిపల్లెకు చేరుకుని ఓ రోజంతా విశ్రాంతి తీసుకుంటారు.