పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ లో విలీనం

 

 

chandrababu ysr congress, chandrababu padayatra, congress chandrababu

 

 

నేను మొదటి నుంచి తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ రెండూ విలీనం కాక తప్పదని చెబుతూనే ఉన్నాను అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఇప్పుడు ఆ రెండు పార్టీలూ ఒకే గూటికి చేరుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు. వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో 'కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోనున్నాం. 2014 తర్వాత కాంగ్రెస్‌లోనే కలుస్తా'మని స్పష్టం చేశారు. ఆ పార్టీ విజయ రహస్యం ఏమిటన్నది ఇప్పుడు బయటపడింది'' అని చంద్రబాబు అన్నారు.


'2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌కు సహకరిస్తాం' అనే ఆమె మాటల్లో అంతరార్థం ఏమిటనేది గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జగన్‌ను కేసుల నుంచి బయటపడేసేందుకు తొలినుంచీ ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే వస్తున్నారు. ఇప్పుడు అదే విషయం బయటపడింది అని బాబు విమర్శించారు.  వైసీపీని కాంగ్రెస్ లో విలీనంచేసే దిశగా ఎత్తుగడలు ప్రారంభమయ్యాయని అన్నారు. పార్టీలను కలిపేసుకోవడానికి కాంగ్రెస్ ఎత్తుగడలు వేయడం కొత్తేమీ కాదని, బ్రహ్మానందరెడ్డి కాంగ్రెస్ నుంచి చిరంజీవి పార్టీ వరకు.. ఇదే కథ కొనసాగిందని గుర్తుచేశారు.