ఆత్మబంధువు చంద్రబాబు

chandrababu telangana, chandrababu seemandhra, chandrababu new capital

కేంద్రం సెపరేట్ తెలంగాణ రాష్ట్రం ప్రకటన పాపం చంద్రబాబుదే అని చాలా మంది ఆయన వైపు వేలెత్తి చూపుతున్నారు. అది శుద్ద అవివేకం. ఆయన మనసులోని నిగూడమైన భావాలు అర్ధం చేసుకునేవారు అలా అంటారు. సీమాంధ్ర ప్రజలు బ్లాక్ డే గా అభివర్ణించిన జూలై 30వ తేది సాయంత్రం చంద్రబాబు పెదవి విప్పి తన మనసులోని మాట చెప్పారు. ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారో సీమాంధ్ర ప్రజలు గమనించలేకపోయారు.

 

 

సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్ లాంటి నగరాన్ని సీమాంధ్ర రాష్ట్రం కోసం నిర్మించుకోవాలని చెప్పారు. ఆ మహానగరం నిర్మాణం కోసం 5 లక్షల కోట్లు కేంద్రాన్ని ఇవ్వవలసిందిగా ఆయన డిమాండ్ చేస్తారట! కాబట్టి 5 లక్షల కోట్లతో సీమాంధ్ర ప్రజలు హైదరాబాద్ ను మించిన నగరాన్ని నిర్మించుకోవచ్చు. హైదరాబాద్ లోని ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ కంటే గొప్ప ఎయిర్ పోర్ట్ ని నిర్మించుకోవచ్చు.



పరిశ్రమలు ఇక్కడ వందల సంఖ్యలో ఐ.టి కంపెనీలు ఉంటే ఆ మహానగరంలో వేల సంఖ్యలో  ఐ.టి కంపెనీలు, పరిశ్రమలు స్థాపించబడేలా చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పదుల సంఖ్యలో స్టార్ హోటల్స్, సూపర్ స్పెషలిటీ హాస్పిటల్స్, ఇంజనీరింగ్ కాలేజీలు ఇతరవి ఇక్కడ ఉంటే వీటికంటే ఎక్కువగా అక్కడ ఉండేలా సీమాంధ్ర ప్రజలు ఏర్పాటు చేసుకోవచ్చు.



ఎందుకంటే 5 లక్షల కోట్ల రూపాయలు సామాన్యమైన డబ్బు కాదు. మరి అంతా డబ్బు కేంద్రం ఇస్తుందా? అంటే చచ్చినట్టు ఇస్తుంది. ఎందుకంటే అక్కడ అడబ్బుని డిమాండ్ చేస్తున్నది చంద్రబాబు నాయుడు కదా! రాష్ట్ర విభజన సమయంలోమౌనంగా ఉన్నందుకైనా కేంద్రం చంద్రబాబు డిమాండ్ కి తల ఒగ్గి  5 లక్షల కోట్లు కోట్లు మరో రాష్ట్ర రాజధాని ఏర్పాటు కోసం ఇస్తుంది.



చంద్రబాబు నాయుడు కల సాకారం కావడానికి 10సంవత్సరాలు కూడా అక్కర్లేదు. నాలుగైదు సంవత్సరాల కాలం చాలు. అపర చాణుక్యుడైనా చంద్రబాబుకి సమైఖ్య ఆంధ్ర ప్రజలు ఎంతైన రుణపడి ఉన్నారు.