టి.అఖిలపక్షంతో ఇబ్బందుల్లో చంద్రబాబు ?

 

 chandrababu tdp, chandrababu telangana, separate telanagna chandrababu, tdp congress

 

తెలంగాణా ఫై అఖిల పక్షం ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించడంతో రాష్ట్రంలో ప్రతి పక్షంగా ఉన్న తెలుగు దేశం పార్టీ ఇబ్బందుల్లో పడింది. తెలంగాణ ఫై కాంగ్రెస్ లోనే భిన్నాభిప్రాయాలున్నాయని, అందు వల్ల కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోదని ఇంత కాలం భావిస్తూ వచ్చిన చంద్ర బాబు, ఇప్పుడు అదే జరగడంతో ఈ విషయంలో తన పార్టీ వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పాల్సి వచ్చింది.



టిడిపి తెలంగాణా ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు మాత్రం తమ నేత తెలంగాణా కు అనుగుణంగా నిర్ణయం తీసుకొంటారని చెబుతున్నారు. తమ పార్టీలోని మూడు ప్రాంతాల నేతలు సమావేశం అయి ఈ విషయంలో ఓ నిర్ణయం తీసుకుంటామని సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అంటున్నారు. ఇప్పటి వరకూ ఈ పార్టీ నేతలంతా,తమ ప్రాంతాలకు తగినట్లుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఈ తరుణం లో మూడు ప్రాంతాల నేతలు ఒక్క చోట కూర్చుంటే ఏకాభిప్రాయం ఎలా సాధ్యపడుతుందనేది ఇక్కడ పెద్ద ప్రశ్నగా మిగిలింది.



ఒక వేళ ఈ సమావేశానికి ఒక్కరినే పంపించాల్సి వస్తే, బాబు ఆంధ్ర నాయకున్ని పంపిస్తారా లేక తెలంగాణా నేతను పంపిస్తారా అన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్ధకం గానే మారింది. చాలా కాలం సమైఖ్య వాణిని వినిపించిన తెలుగు దేశం ప్రస్తుతం తీసుకొనే నిర్ణయం ఫై అంతటా సస్పెన్స్ నెలకొని ఉంది. ఏది ఏమైనా, చంద్ర బాబు నాయుడు కు కీలక సమయం వచ్చినట్లే భావించాల్సి ఉంటుంది.