అమరావతి పోరాటం..  29 గ్రామాల పోరాటం కాదు.. 5 కోట్ల ఆంధ్రుల పోరాటం

అమరావతిలో దీక్షలు చేస్తున్న రైతులకు చంద్రబాబు సంఘీభావాన్ని ప్రకటించారు .ఆయన కుటుంబ సభ్యులు కూడా దీక్షలో పాల్గొన్నారు. జగన్ పాలన పిచ్చి తుగ్లక్ పాలనను తలపిస్తోందన్నారు చంద్రబాబు. జగన పాలనలో అభివృద్ధి కనుమరుగవుతొందని ఆయన విమర్శించారు. జగన్ కు దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందే సమయంలో ఈ పిచ్చి తుగ్లక్ పాలనతో వచ్చే అభివృద్ధిని ఆపేసి అరాచకానికి శ్రీకారం చుట్టారని చంద్రబాబు మండిపడ్డారు. ఇష్టానుసారంగా చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ఎవరైతే ఆందోళన చేస్తారో వారందరని తిడుతున్నారని, నిన్నా,మొన్న పవన్ కళ్యాణ్ ని కూడా విపరీతంగా తిట్టారని ఆయన మండిపడ్డారు. 

రాజధాని కోసం జరుగుతున్న పోరాటం కేవలం ఇరవై తొమ్మిది గ్రామాలది మాత్రమే కాదని రాష్ట్రమంతటా మద్దతు లభిస్తోందని ఆయన వెల్లడించారు. అణచాలనుకుంటే అణగిపోయే ఉద్యమం కాదని పోరుబాటలో సాగుతున్న అమరావతి రైతులను చంద్రబాబు అభినందించారు. వారు చేసే పోరాటం ఇరవై తొమ్మిది గ్రామాల పోరాటం కాదని ఐదు కోట్ల ఆంధ్రుల కోసం చేసే పోరాటమని చంద్రబాబు తెలియజేశారు. ఈ ఉద్యమం కోసం రాష్ట్రం మొత్తం ముందుకు వస్తున్నారని, దానికి మనస్పూర్తిగా వాళ్ళని అభినందింస్తున్నానట్లు తెలియజేశారు.ఈ ఉద్యమానికి స్పూర్తి ఇచ్చింది రైతులేనని, ఈ పోరాటం ప్రారంభించిన మిమ్మల్ని సర్కార్ అణగదొక్కాలకుంటున్నట్లు తెలియజేశారు. రైతులకు ఎళ్ళప్పుడు అండగా ఉంటానని బాబు హామీ ఇచ్చారు.