టీఆర్ఎస్ గెలుపుపై చంద్రబాబు రియాక్షన్

 

తెలంగాణలో టీఆర్ఎస్ దే అధికారం అని తేలిపోయినట్టే. ఇప్పటికే టీఆర్ఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. తెలంగాణ ఎన్నికల పోరు టీఆర్ఎస్, ప్రజకూటమి మధ్య నువ్వా నేనా అన్నట్టు సాగుతుంది అనుకున్నారంతా. కానీ ఫలితాలు ఏకపక్షంగా వచ్చాయి. టీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీతో అధికారం నిలబెట్టుకుంటుంది. దీంతో పలువు నేతలు, ప్రముఖులు కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా ట్విట్టర్ వేదికగా కేసీఆర్ కు శుభాకాంక్షలు తెలిపారు.

టీఆర్ఎస్ ని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్, టీడీపీ పార్టీలు ప్రజకూటమితో దగ్గరయ్యాయి. దీంతో ప్రచారంలో టీఆర్ఎస్ నేతలు చంద్రబాబు మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు కూడా టీఆర్ఎస్ కి వ్యతిరేకంగా ప్రచారం చేశారు. అయితే ఇదంతా ఎన్నికలు వరకే అని చంద్రబాబు రుజువు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్ గారికి శుభాకాంక్షలు’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల్లో విజయం సాధించిన అభ్యర్థులకు కూడా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.