ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలి మృతి : చంద్రబాబు స్పందన

 

 

 

ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు మృతి చెందడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మృతి పట్ల రెండు నిముషాలు మౌనం పాటించి, తమ ప్రగాఢ సంతాపం తెలియజేశారు. నిందితులను శిక్షంచడంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు.


రేప్ బాధితురాలి మృతికి సంతాపంగా చంద్రబాబు, నేతలు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతూ పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. మహిళలకు భద్రత కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. మహిళల రక్షణకు కఠిన చట్టాలు తీసుకురావాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. దేశ రాజధానిలోనే ఇలాంటి దారుణం జరిగితే ఇక మారుమూల గ్రామాల పరిస్థితేంటని ఆయన ప్రశ్నించారు. ఢిల్లీలో వైద్య విద్యార్తిని అత్యాచార ఘటనపై పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, రాష్ట్రపతి కుమారుడి వ్యాఖ్యలు బాధాకరమిన చంద్రబాబు అన్నారు.



బాధితురాలికి న్యాయం చేయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ నిరసనకు దిగిన వారిపై లాఠీఛార్జీ, వాటర్ క్యేనాన్లు, భాష్ప వాయువు ప్రయోగించారని చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. అత్యాచారం లాంటి ఘటనలకు పాల్పడితే శిక్షలు కఠినంగా ఉంటాయన్న అవగాహన కల్పించాలని అన్నారు.