నా కూతుర్ని వేధిస్తున్నారు.. చక్రి మామ

 

దివంగత సంగీత దర్శకుడు చక్రి భార్య శ్రావణి తన భర్త తరఫు బంధువులు తనను ఆస్తికోసం వేధిస్తున్నారని మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఆమె ఈ విషయంలో హెచ్చార్సీకి కూడా ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని వుందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో శ్రావణి తండ్రి కూడా మీడియా ముందుకు వచ్చారు. చక్రి తరఫు బంధువులు తన కుమార్తె శ్రావణిని ఎంతో వేధిస్తున్నారని ఆయన చెప్పారు. తాను ప్రభుత్వంలో ఉన్నతోద్యోగం చేస్తున్నానని, తన కుమార్తె శ్రావణి ఇంజనీరింగ్ చదివిందని, అలాంటి తన కుమార్తెను పట్టుకుని చక్రికి విషం పెట్టి చంపిందని వారు ఆరోపించడం దారుణమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుంచి తన కుమార్తెకు ప్రాణహాని వుందన్న భయాన్ని ఆయన వెలిబుచ్చారు.