చైన్ స్నాచర్ శివ గ్యాంగ్ పట్టివేత

 

హైదరాబాద్‌లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మోస్ట్ వాంటెడ్ చైన్స్నాచర్ శివ ముఠా సభ్యులు ముగ్గురిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిలో శివ భార్యతో పాటు శ్రీరామ్ సిటీ యూనియన్ ఫైనాన్స్ చంపాపేట బ్రాంచ్ మేనేజర్, ముత్తూట్ ఫైనాన్స్ ఓంకార్ నగర్ బ్రాంచ్ కూడా మేనేజర్ ఉన్నారు. పోలీసులు వారి నుంచి 4.5 లక్షల నగదు, 3.75 కేజీల బంగారు ఆభరణాలతో పాటు, 2 కార్లు, బైక్‌లు, విలువైన ఫర్నిచర్ను స్వాధీనం చేసుకున్నారు. శివ గ్యాంగ్పై దాదాపుగా 700 చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి.