కేంద్ర ప్రతిపాదన : శృంగార వయస్సు తగ్గింపు

సెక్స్ లో పాల్గొనే వయస్సును 18 సంవత్సరాలనుంచి 16 సంవత్సరాలకు తగ్గించాలనే ప్రతిపాదనను కేంద్రం ప్రతిపాదించింది. కొత్త క్రిమినల్ చట్టం సవరణ బిల్లులో లైంగిక దాడి బదులు రేప్ అనే పదాన్ని చేర్చాలనే ఆలోచనలో ఉంది. కేంద్రం ఇటీవలే జారీ చేసిన క్రిమినల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ స్థానంలో దీన్ని ప్రవేశపెట్టే యోచనలో ఉంది. ఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన నేపథ్యంలో ఏర్పాటు చేసిన వర్మ కమీషన్ సిఫారసు మేరకు లైంగికదాడి పదాన్ని తొలగించి మరింత విస్తృత పరిథి కల్పిస్తూ రేప్ అనే పదాన్ని తిరిగి జతచేయాలని నిర్ణయించినట్లు సమాచారం.