Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల పై కేంద్ర మంత్రి క్లారిటీ..
posted on: Mar 22, 2021 6:18PM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశంపై ఏపీలో రచ్చ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా ఇటు కార్మికులు, అటు ప్రజలు వివిధ స్థాయిలలో ఉద్యమం చేస్తున్న సంగతి తెల్సిందే. మరోపక్క విశాఖ ఉక్కు నష్టాలను తగ్గించడానికి మిగులు భూములుగా ఉన్న 7 వేల ఎకరాలను అమ్మాలని ఎపి సీఎం జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై కేంద్రం నుండి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు.
తాజాగా స్టీల్‌ప్లాంట్ మిగులు భూములపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది ఇవాళ లోక్‌సభలో మిగులు భూముల విషయంపై వైసీపీ కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ సమాధానం ఇచ్చారు. ఉక్కు ఫ్యాక్టరీ మిగులు భూములను ప్రైవేట్‌పరం చేసే విషయాన్నికేంద్రం పరిశీలిస్తోందని కేంద్రమంత్రి ఠాకూర్ చెప్పారు. అవసరమైన మేరకు స్టీల్‌ప్లాంట్ భూములను ప్రైవేట్‌పరం చేస్తామని అయన ఈ సందర్భంగా చెప్పారు. మిగిలిన వాటిని ఏం చేయాలో ఆ తర్వాత పరిశీలిస్తామని ఠాకూర్ తెలిపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి ఒక నిర్ణయం తీసుకుంటామని అయన అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ వేస్తామని అయన స్పష్టం చేశారు. స్టీల్‌ప్లాంట్‌లో మొత్తం 7 వేల ఎకరాల మిగులు భూములు ఉన్నాయని కేంద్రమంత్రి ఠాకూర్ తెలిపారు. మొత్తానికి ఇటు ఎపి సీఎం అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఒకే బాటలో నడుస్తుండడం గమనార్హం.






