జగన్ కు మరో ఎదురుదెబ్బ... మళ్లీ షాకిచ్చిన సీబీఐ కోర్టు...

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మళ్లీ ఎదురుదెబ్బ తగిలింది. అక్రమాస్తుల కేసులో మరోసారి జగన్ కు చుక్కెదురైంది. జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న రెండు విజ్ఞప్తులను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది. డిశ్చార్జి పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. అలాగే, సీబీఐ కేసుల విచారణ పూర్తయిన తర్వాతే ఈడీ కేసుల విచారణ జరపాలని, అలాగే ఈడీ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ దాఖలు చేసిన మరో పిటిషన్ ను కూడా సీబీఐ కోర్టు కొట్టివేసింది. ఇరువర్గాల సుదీర్ఘ వాదనల తర్వాత డిశ్చార్జి పిటిషన్లు అన్నింటినీ కలిపి విచారించేందుకు కోర్టు నిరాకరించింది. వేర్వేరుగానే విచారణ జరపాలని నిర్ణయం తీసుకుంది.

ఇక, పెన్నా ఛార్జిషీట్లో అనుబంధ అభియోగపత్రంపై విచారణ జరిపిన సీబీఐ కోర్టు నెక్ట్స్ హియరింగ్ ను జనవరి 24కి వాయివా వేసింది. ఈ కేసులో నిందితులంతా హాజరుకాగా... ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రం మినహాయింపు లభించింది. ఇవాళ్టి వ్యక్తిగత హాజరు నుంచి మినహయింపు కోరుతూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ ను న్యాయస్థానం అంగీకరించింది.