ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పై క్యాట్ నిర్ణయం 24కి వాయిదా

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఎడిషనల్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తన సస్పెన్షన్ ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వర రావు క్యాట్ ను ఆశ్రయించారు. తాజాగా క్యాట్ లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఈరోజు విచారణ ప్రారంభమైంది. విచారణ సందర్భంగా ఏబీ వెంకటేశ్వరరావు తరుపున అదేవిధంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ కేసును ఈనెల 24 వ తేదీకి వాయిదా వేసింది. సింగిల్ బెంచ్ వుండటం వలన వెంటనే నిర్ణయం తీసుకోలేకపోతున్నామని 24వ తేదీకి పూర్తి స్థాయి నిర్ణయం వెల్లడిస్తామని చెప్పి క్యాట్ స్పష్టం చేసింది.

అదేవిధంగా తనకు ఎనిమిది నెలలుగా జీతం ఇవ్వక పోవటమే కాకుండా తనను నిరాధారమైన ఆరోపణలతో సస్పెండ్ చేశారని చెప్పి ఏబీ వెంకటేశ్వర రావు తన పిటిషన్ లో పేర్కొన్నారు. పైగా కొనని పరికరాలని కొనుగోలు చేసినట్టు చూపించటమే కాకుండా అందులో అవినీతికి పాల్పడినట్టు పేర్కొంటూ పైగా తన కుమారుడికి సంబంధం లేని అంశాలను కూడా తన కుమారుడికి సంబంధం ఉన్నట్టు చూపించడం వంటి అంశాలన్నిటిపై కూడా ఏబి వెంకటేశ్వర రావు క్యాట్ ను ఆశ్రయించారు. వీటి ఆధారంగా తనను సస్పెండ్ చేయడం అన్యాయమని చెప్పి ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని చెప్పి కూడా అందులో పేర్కొన్నారు.

అంతేకాకుండా ఏబీ వెంకటేశ్వరరావు తరపున సీనియర్ కౌన్సిల్ లో వాదించారు. కాగా ఏపీ ప్రభుత్వం తరపున ప్రకాష్ రెడ్డిని నియమిస్తూ నిన్న ప్రభుత్వం జివో జారీ చేసింది. ప్రభుత్వం తరపున కూడా ప్రకాశ్ రెడ్డి వాదనలు వినిపించారు. దాదాపుగా 45నిమిషాల సేపు అటు ప్రభుత్వం తరఫునుంచి ఇటు ఏబి వెంకటేశ్వర రావు తరుపు నుంచి వాదోపవాదాలు జరిగాయి. ఆ తర్వాత ఈ నెల 24 వ తేదీకి వాయిదా వేస్తూ ఆ రోజు తుది నిర్ణయం వెలువరిస్తామని చెప్పి క్యాట్ స్పష్టం చేసింది.