టీఆర్ఎస్ శ్రవణ్‌పై కేసు!

 

 

 

తాను ఏ పార్టీలో వుంటే ఆ పార్టీకి అనుకూలంగా అడ్డంగా వాదించడంలో సిద్ధహస్తుడైన దాసోజ్ శ్రవణ్ పీఆర్పీ అనే అస్తమించిన పార్టీ ద్వారా రాజకీయ రంగంలోకి వచ్చాడు. పీఆర్పీ పనికిరాని సిద్ధాంతాల గురించి గొంతు చించుకుని మరీ అరిచి ఎదుటివారిని ఒప్పించే ప్రయత్నం చేసేవాడు. పీఆర్పీ అస్తమించిన తర్వాత ఆయనగారు టీఆర్ఎస్‌లో చేరిపోయి సీమాంధ్రుల మీద నిప్పులు చెరగడంలో, అక్కసు కక్కడంలో బిజీగా వున్నాడు.

 

ఆయనగారి టాలెంట్ చూసిన కేసీఆర్ ఆయనగారిని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా నియమించాడు. చేతిలో పదవి వుంది. అరవడానికి నోరుంది. దాంతో రెచ్చిపోయిన శ్రవణ్ విశ్వరూపం అందరూ చూస్తున్నదే. టీఆర్ఎస్‌లో బెదిరింపు సెక్షన్ ఎక్కువ. ఆ బెదిరింపు సెక్షన్‌ని శ్రవణ్ ఒక దర్శకుడి మీద ప్రయోగించడంతో ఆ దర్శకుడు శ్రవణ్ ఫోన్‌లో చేసిన బెదిరింపులన్నిటీని రికార్డు చేసి జూబిలీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాంతో శ్రవణ్ మీద కేసు నమోదైంది. అరెస్టు చేసి లోపల వేయడం మాత్రం మిగిలి వుంది.