ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ రద్దు: ఎమ్మెల్యేలందరూ మాజీలే!

 

 

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీని రద్దు చేయాలని, ప్రస్తుతం రాష్ట్రంలో వున్న రాష్ట్రపతి పాలనను మరో రెండు నెలలు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. శుక్రవారం సాయంత్రం ప్రధాని నివాసంలో జరిగిన సమావేశంలో మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్టికల్ 356 (3) ప్రకారం అసెంబ్లీని సుప్తచేతనావస్థలో వుంచుతూ మార్చి 1 నుంచి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించారు. రెండు నెలలలోపు రాష్ట్రపతి పాలనకు పార్లమెంటు ఆమోదం పొందాల్సి వుంటుంది. అయితే ఎన్నికల తరుణంలో ఆ అవకాశం లేకపోవడం వల్ల అసెంబ్లీని రద్దు చేసి, రాష్ట్రపతి పాలను పొడిగించడమే మార్గంగా మారింది. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యేలందరూ మాజీలైపోయారు. అసెంబ్లీ రద్దు, రాష్ట్రపతి పాలన పొడిగింపు నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్రపతి త్వరలో జారీచేస్తారు.