మర్డర్ కేసులో బైరెడ్డి?

 

 

 

రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బెరైడ్డి రాశేఖరరెడ్డిపై హత్య కేసు నమోదైంది. నందికొట్కూరు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సాయి ఈశ్వరుడు దారుణ హత్యపై మృతుడి కుమారుడు కర్నూలు త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బెరైడ్డి రాశేఖరరెడ్డి, ఆయన తండ్రి శేషశయనారెడ్డి, తమ్ముడి కుమారుడు సిద్దార్ధరెడ్డిలతోపాటు ముచ్చుమర్రి గ్రామానికి చెందిన మరికొంతమంది తన తండ్రిని హతమార్చారని సాయి ఈశ్వరుడు కుమారుడు ఫిర్యాదు లో పేర్కొన్నాడు.

 

సాయి ఈశ్వరుడు గతంలో బెరైడ్డి రాశేఖరరెడ్డి ముఖ్య అనుచరుడు. తరువాత కాలంలో ఆయనకు దూరమయ్యాడు. ఆ తరువాత కాలంలో సాయి ఈశ్వరుడు ఒకసారి హత్యా ప్రయత్నం జరిగింది. ఆధారాలు లేకపోవడంతో ఈ కేసును కోర్టు కొట్టేసింది. పిల్లల చదువుల కోసం కర్నూలు వచ్చి స్థిరపడిన సాయి ఈశ్వరుడు ప్రత్యర్ధులు బలిగొన్నారు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆధిపత్యం చాటుకొనేందుకే ఈ హత్యకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.