చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి!!

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.అమరావతి ఆర్టీసీ బస్సును ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీ కొట్టగా ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు,మరికొందరు గాయపడ్డారు. కాశిపెంట్ల దగ్గర పూతలపట్టు రహదారి పై ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాద క్షతగాత్రులను తిరుపతి రియా ఆసుపత్రికి తరలించారు.రెండు బస్సుల్లోనూ వాళ్ళందరికీ కూడా తీవ్రమైన గాయాలయ్యాయి. ఇప్పటి వరకు ఇద్దరు చనిపోగా మరో 30 మందికి తీవ్రమైన గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.ఆసుపత్రి మొత్తం కూడా బాధితులతో నిండిపోయి క్యాజువాల్టీ అంత కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న బస్సు ప్రమాద బాధితులతో కొంతమందికి చేతులు విరిగితే మరికొంత మందికి కాళ్లు విరిగాయి. గాయాల పాలైన వారందరు కూడా నొప్పులు తట్టుకోలేక రోదిస్తున్నారు.దెబ్బలు తిన్న వాళ్లలో ఎక్కువ మంది మహిళలు, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు.

అయ్యప్ప స్వామి భక్తులతో వెళ్తున్న బస్సును మరొవైపు నుంచి వస్తున్న అమరావతి బస్సు రెండు ఎదురెదురుగా మంచు కారణంగా రోడ్లు సరిగా కనిపించక ఢీ కొన్నట్టుగా సమాచారం. రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులందరికీ కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయి.అందరూ నిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్న నేపధ్యంలో ఎవరికి వాళ్లును కాపాడూకోవడమే కష్టతరంగా మారింది.చివరికి  రెండు బస్సులు పూర్తిగా ధ్వంసం కాగా  బస్సులోంచి గాయాల పాలైన వారిని బయటికి తీయడం కూడా చాలా కష్టంగా మారింది.బస్సు ముందుభాగాలు పూర్తిగా నుజ్జునుజ్జైపోవటంతో లోపల చిక్కుకున్న బాధితులను బయటకు తెచ్చే ప్రయత్నంలో గ్యాస్ కట్టర్ల సాయంతో కట్ చేసి స్థానికులందరూ అప్రమత్తమై 108 వాహనాన్ని పిలిచి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.మొత్తం మీద ప్రమాదంలో అందరికి తీవ్ర గాయాలు అయినట్లు సమాచామృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.