బడ్జెట్ ‌2015-16: పన్నుల విధింపులు..తగ్గింపులు

2015-16 బడ్జెట్‌లో ఆదాయం పన్ను పరిమితిని గణనీయంగా పెంచుతారని మధ్య తరగతి ప్రజానికం ఆశించింది. అయితే ఆదాయం పన్నుల విధానంలో ఎట్టిమార్పు లేదని అరుణ్‌ జైట్లీ తమ బడ్జెట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించకపోవడం ద్వారా స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శ్లాబ్‌లో కూడా మార్పులేదు. బడ్జెట్‌లోని పన్నుల విధింపులు, పన్నుల తగ్గింపులు.. మినహాయింపుల వివరాలు.

పన్నుల విధింపులు..

    హెల్త్ ఇన్స్యూరెన్స్ లిమిట్ రూ.25వేలకు పెంపు
    సర్వీస్ ట్యాక్స్ 14శాతం పెంపు
    పెరగనున్న సిగరెట్ ధరలు
    ఆరోగ్య బీమా ప్రీమియంపై పన్ను రాయితీ.. 15 వేల నుంచి 25 వేలకు పెంపు
    సీనియర్ సిటిజన్లకు ఇది 10 వేల నుంచి 30వేలకు పెంపు   
    పెన్షన్ ఫండ్కు చెల్లింపులపై రాయితీ 1 లక్ష నుంచి 1.5 లక్షలకు పెంపు
    బినామీ ఆస్తులపై కొరడా ఝులిపిస్తాం
    సంపద పన్ను రద్దు
    కోటి రూపాయల ఆదాయం దాటితే 2శాతం అదనపు పన్ను
    వెయ్యి రూపాయలు దాటిన పాదరక్షలపై ఆరు శాతం సుంకం
    బొగ్గు మీద క్లీన్ ఎనర్జీ సెస్ 100 నుంచి 200 పెంపు
    సంపద పన్నుపై 2శాతం అదనపు సర్ చార్జీలు
    2015-16 మధ్య ఆర్ధిక అభివృద్ధి 8 నుంచి 8.5శాతం పెరిగే అవకాశం
    జీడీపీ వృద్ది రేటు 7.8 శాతం ఉంది.. ఇది మరింత పెరగనుంది

పన్నుల తగ్గింపులు.. మినహాయింపులు..

    స్వచ్ఛ భారత్కు అందించే నిధులకు వందశాతం పన్ను మినహాయింపు
    తగ్గనున్న బూట్ల ధరలు.. లెదర్ గూడ్స్పై ఆరుశాతం పన్ను తగ్గింపు
    ట్రాన్స్ పోర్ట్ అలవెన్స్ కింద 1600వరకు మినహాయింపు
    80 ఏళ్లు దాటిన వారికి 30 వేల వరకు వైద్య బిల్లులు పన్ను నుంచి మినహాయింపు
    వికలాంగులకు అదనంగా 20వేల పన్ను రాయితీ
    సాంకేతిక సేవలపై పన్ను 15శాతం తగ్గింపు
    కార్పోరేట్ పన్ను 30 నుంచి 25శాతానికి తగ్గింపు. ఈ తగ్గింపు నాలుగేళ్ల పాటు వర్తిస్తుంది.   
    దవ్యోల్బణం 6శాతానికి పెరగకుండా చర్యలు తీసుకుంటాం 
    ద్రవ్యోల్బణం 6 శాతం దాటకుండా చర్యలు తీసుకుంటాం.