అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ స్పీచ్ హైలైట్స్

Budget 2015 Arun Jaitley speech highlights, Arun Jaitley Budget speech,  Arun Jaitley Budget

దేశ ఆర్థికాభివృద్ధిలో రాష్ర్టాలకు సమాన అధికారం అందించామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. శనివారం లోక్‌సభలో 2015-16 ఆర్థిక బడ్జెట్‌ను అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ 9 నెలల పాలనలో ఆర్థికాభివృద్ధిలో అనేక చర్యలు తీసుకున్నామన్నారు. ఆయన ప్రసంగంలోని కీలకాంశాలు.

అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ స్పీచ్ లోని హైలైట్స్ :

   
రూపాయి మారకం విలువ బలపడుతోంది.     
    ఆర్థిక అభివృద్ధిలో ప్రజలందరు భాగస్వాములు.
    ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రాల పాత్ర కీలకం.
    భారత్ వృద్ధి చెందుతోందని ప్రపంచమంతా నమ్ముతోంది.
    340 బిలియన్ డాలర్లకు చేరుకున్న విదేశీ మారకపు నిల్వలు.
    పేదరిక నిర్మూలన, ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం.
    ప్రజల ఆశలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది.
    అవినీతిని అంతం చేసేందుకు ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు.
    భారత ఆర్ధిక వ్యవస్థకు బడ్జెట్ దశా నిర్దేశం చేస్తుంది.
    ప్రత్యక్ష నగదు బదిలీని కూడా త్వరలో ప్రవేశపెడతాం.
    జీఎస్టీ 2016 ఏప్రిల్ 1నుంచి అమల్లోకి వస్తుంది.
    కరెంట్ అకౌంట్ లోటు  మూడుశాతం.
    ఈ సమావేశాల్లోనే నల్లధనంపై బిల్లు.
    మనీలాండరింగ్ చట్టాల్లో మార్పులు.
    ఆదాయ పన్ను యధాతథం.