ఢిల్లీ ఫామ్ హౌస్ లో బిఎస్పీ నాయకుడి హత్య

BSP Leader Deepak Bharadwaj Shot Dead, Deepak Bharadwaj BSP Leader Killed, BSP Leader Deepak Bharadwaj Shooted in Delhi

 

2009 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన వారందరిలో అత్యంత ధనికుడిగా రికార్డ్ కలిగిన బిఎస్పీ నాయకుడు దీపక్ భరద్వాజ్ హత్యకు గురయ్యారు. దీపక్ భరద్వాజ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కూడా. దక్షిణ ఢిల్లీలోని వసంత కుంజ్ లోని ఫాంహౌస్ లొ ఉదయం ఇద్దరు వ్యక్తులు నలుపురంగు కారులో వచ్చి అతి సమీపంనుంచి దీపక్ పై కాల్పులు జరిపారు. దీపక్ అక్కడికక్కడే మరణించారని తెలిసింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వచ్చిన విభేదాలే ఈ హత్యకు కారణం అయివుంటుందని పోలీసులు భావిస్తున్నారు.