హైదరాబాద్‌లో బాణాసంచా దుకాణంలో పేలుడు

 

హైదరాబాద్‌లో పేలుడు సంఘటన జరిగింది. బేగంపేటలోని అజీజ్ ప్లాజా ఎదురుగా పేలుడు సంభవించింది. ఈ కాంప్లెక్స్‌లో ఎదురుగా వున్న బాణాసంచా దుకాణంలో ఈ పేలుడు జరిగింది. బాణాసంచా అంటుకున్న కారణంగా మంటలు ఎగసిపడుతున్నాయి. అయితే వాటిని అదుపులోకి తేవడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. కొద్ది సంవత్సరాల క్రితం ఇదే ప్రాంతంలో బాణాసంచా దుకాణంలో అగ్నిప్రమాదం జరగడంతో కొంతమంది మరణించారు.