బిజెపి తెలంగాణ మేనిఫెస్టో

 

 

 

తెలంగాణ బీజేపీ మేనిఫెస్టోను టీ-బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు బండారు దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టో రూపొందించామని స్పష్టం చేశారు.

మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు:

1. రైతులకు 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్.
2. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి.
3. ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా.
4. వ్యవసాయాభివృద్ధి కోసం ఆధునిక పరిజ్ఞానం.
5. ప్రభుత్వ-ప్రైవేటు ప్రాజెక్టులకు పెద్దపీట.
6. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ.
7. రూ.20 వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్.
8. ఆదిలాబాద్ జిల్లాకు కొమురం భీం పేరు.
9. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినం.
10. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినం.
11. అక్టోబర్ 19న గిరిజన సాధికార దినం.
12. అమరవీరుల కుటుంబాలకు 10 లక్షల ఎక్స్‌గ్రేషియా, మూడెకరాల భూమి లేదా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం.
13. పారదర్శకతతో కూడిన ప్రభుత్వ వ్యవస్థ.
14. బ్రాండ్ ఇండియా నిర్మాణానికి కృషి.