మహారాష్ట్ర ఎన్నికలకు బీజేపీ మేనిఫెస్టోని విడుదల చేసిన నడ్డా...

 

మహారాష్ట్ర ఎన్నికల్లో దూకుడు ప్రదర్శించటంలో జోరందుకుంటోంది అధికార బీజేపీ. ఎన్నికల్లో ప్రధాన అస్త్రం అయినటువంటి మేనిఫెస్టోని విడుదల చేసింది. ఫూలే సావర్కర్ లకు భారతరత్న ఇప్పించటం దగ్గరి నుంచి ఐదేళ్లలో కోర్టు ఉద్యోగాల వరకు మేనిఫెస్టోని జనరంజకంగా ఉండేటట్టు చూసుకుంది. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చేతుల మీదుగా మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం ఫడ్నవీస్ ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. మేనిఫెస్టోకీ సంకల్ప పత్ర్ అనే పేరును కూడా పెట్టారు. జ్యోతిబాపూలే, సావిత్రిబాయిఫూలే, వీర్ సావర్కర్ లకు భారతరత్న వచ్చేలా ప్రయత్నిస్తామన్నారు.

మహిళల సేఫ్టీ ప్యాడ్లను ఒక రూపాయికే అందించటం, ప్రభుత్వాసుపత్రుల్లో ఆయుర్వేద వైద్యాన్ని పెంచటం, ప్రతి జిల్లా కేంద్రంలో ఓ యోగా కేంద్రం, అటల్ విజ్ఞాన్ కేంద్రాన్ని నెలకొల్పడమే కాక మహారాష్ట్ర జీడీపీని ట్రిలియన్ డాలర్ లకు తీసుకెళ్లి రికార్డులకు ఎక్కిస్తామని హామీలు ఇచ్చారు.ఇక 2020 కల్లా అంబేద్కర్ మెమోరియల్ ను పూర్తి చేస్తామన్నారు. ప్రతీ గ్రామ పంచాయతీని బ్రాడ్ బ్యాండ్ ద్వారా కలపడం, వీర మరణం పొందిన జవాన్ లు, పోలీసుల కుటుంబాలకు ప్రత్యేక వసతులు కల్పించేలా చేస్తామని హామీ ఇచ్చారు. 2022 కల్ల మహారాష్ట్రలో ఉన్న ప్రతీ ఇంటికీ మంచినీటి సరఫరా చేస్తామన్నారు బీజేపీ నేతలు. అయిదేళ్లలో కోర్టు ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్నారు. అదే సమయంలో మహారాష్ట్రని కరువు రహితంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఇక మహారాష్ట్ర రైతులకు పన్నెండు గంటల విద్యుత్ సరఫరా కూడా చేసామని హామీ ఇచ్చారు బీజేపీ నేతలు. ఇక ఈ మేనిఫెస్టోలోని పనులు అన్నింటిని నిజంగా అమలు చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.