'గాంధీ సంకల్ప' యాత్రను ప్రారంభించిన సుజనా...

 

కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో 'గాంధీ సంకల్ప' యాత్రలో ఎంపీ సుజనా చౌదరి పాల్గొన్నారు. గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు సుజనా మరియు ఇతర నేతలు. నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో సాయంత్రం వరకు పాద యాత్ర సాగనుంది. ఈ సందర్భంగా సుజనా మాట్లాడుతూ.. ఈ యాత్రను ప్రారంభంచడం తనకు గర్వకారణమని వెల్లడించారు.ప్రతి ఏటా అక్టోబర్ రెండున అనేక సంవత్సరాల నుంచి మనం గాంధీ జయంతిని జరుపుకుంటున్నాం అని అయితే ఈ సారి నరేంద్ర మోడీ గారు గాంధీ సంకల్ప యాత్రగా పెట్టటానికి కారణం నూట యాభైవ సంవత్సరాల జయంతి సందర్భంగా ప్రతి ఒక్క ప్రజానాయకుని ఒక నూట యాభై కిలో మీటర్లు పాద యాత్ర చేసి ప్రజల యొక్క కష్టనష్టాలు తెలుసుకోమని ఆయన ఆదేశించడం కోసమే ఈ యాత్రను మొదలుపెట్టినట్లు సుజనా వ్యాఖ్యానించారు. 

ఇరవైవ శతాబ్దంలో గాంధీ గారి యొక్క అహింసావాదం, సత్యాగ్రహంతో ప్రపంచ దేశాలన్నిటికీ భారతదేశం అంటే ఏమిటని తెలియపరిచారు. ఇరవై ఒకటవ సంవత్సంలో తమ  ప్రియతమ నాయకుడు అయిన నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలన్నిటికీ ప్రపంచ నాయకుడై ఈ మధ్య అమెరికా హ్యూస్టన్ నగరంలో జరిగిన మీటింగ్ సందర్భంగా అందరికీ తెలియడం కూడా జరిగింది. అయితే ఈ రోజు గాంధీగారు అనేకమైనవి చెప్పారు, ముఖ్యంగా అన్ని జన్మలోకన్నా మానవ జన్మ ఎంత గొప్ప జన్మ, మానవ జన్మగా పుట్టినందుకు మానవత్వాన్ని మరిచిపోకండి.  అందరు మానవులను కూడా సమానంగా చూడండి. తన, మన, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా, సెక్యులర్ భావాలతో ప్రజలందరూ కూడా ఆహ్లాదకరంగా జీవించాలని ఆయన కోరిక. భారతదేశంలో ముఖ్యంగా అధికార వికేంద్రీకరణ, ఆర్థిక వికేంద్రీకరణ అంటే పంచాయతీ వ్యవస్థలోకి అధికారాలివ్వాలని చెప్పి ఆయన ముఖ్య ఉద్దేశం. అట్లాగే ప్లాస్టిక్ ను వాడకూడదని ఆరోజుల్లోనే ఆయన చెప్పారు. ఇప్పుడు డెబ్బై సంవత్సరాల తర్వాత మళ్లీ అదే విషయం మాట్లాడతా ఉన్నాము. అది కాకుండా గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాల్లోనే ప్రతి ఒక్కరిని కూడా వృత్తిధర్మంగా ఉండాలని కోరుకుంటున్నానని ఎంపీ సుజనా చౌదరి తెలియజేశారు.