నెటిజన్లు దెబ్బకి ఆప్షన్లు బ్లాక్ చేసుకున్న బీజేపీ...

 

అసలే కేంద్రంలో బీజేపీపై ప్రజల్లో వ్యతిరేక భావన పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత బీజేపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. కేంద్ర బడ్జెట్ విషయంలో బీజేపీ తీరును ప్రతిపక్షాలు ఎండగడుతున్నాయి. ఇక నెటిజన్లు కూడా బీజేపీపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఏ నెటిజన్ల ఫాలోయింగ్ తో గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన బీజేపీ..ఇప్పుడు అదే నెటిజన్ల ఆగ్రహానికి గురవుతున్నారు. సోషల్ మీడియాతో అద్భుతాలు సృష్టించిన బీజేపీని ఇప్పుడా సోషల్ మీడియా... బడ్జెట్ ప్రవేశపెట్టిన తరువాత అదో సోషల్ మీడియావల్ల బెంబేలెత్తిస్తోంది. దీంతో బీజేపీ ఆఖరికి ఆప్షన్లు బ్లాక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 

బీజేపీ అధికార ఫేస్ బుక్ పేజ్ కు డిస్ లైక్ లు కొడుతూ ‘నువ్వు మాకు నచ్చలేదు’ అని నెటిజన్లు సూటిగా చెబుతున్నారు. బడ్జెట్ కు ముందు ఆ పార్టీ ఫేస్‌ బుక్‌ పేజ్ కి ఫైవ్ స్టార్ రేటింగ్ ఇచ్చిన వాళ్లు 17వేల మంది ఉండగా ఇప్పుడు సింగిల్‌ స్టార్‌ రేటింగ్ ఇచ్చిన వారి సంఖ్య 35 వేలు దాటింది. దీంతో వ్యతిరేకతను అర్ధం చేసుకున్న బీజేపీ సోషల్‌ మీడియా... తమ ఫేస్‌ బుక్‌ పేజీలో ‘డిస్‌ లైక్‌’ ఆప్షన్‌ ను, రేటింగ్‌ కోరడాన్ని బ్లాక్‌ చేశారు. మరి ఆప్షన్లు బ్లాక్ చేసినంత మాత్రన నెటిజన్లు ఊరుకుంటారా... ‘‘హోదా ఇవ్వలేదు... ప్యాకేజీ అంటూ ఆ నిధులూ మంజూరు చేయలేదు.. రైల్వే జోన్‌ ప్రకటించలేదు. చివరికి.. తాజా బడ్జెట్‌ లో మొండిచేయి చూపారు’’ అంటూ కామెంట్లతో నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. మరి అన్యాయం చేసిన బీజేపీకి ఈ భజన తప్పదుమరి...