భూటాన్ రాణికి మగబిడ్డ

 

భూటాన్ రాణి జెట్సన్ పెమా మగబిడ్డకు జన్మనిచ్చింది. భూటాన్ రాజధాని థింపూలోని లింకాన్ ప్యాలెస్ లో యువరాజు జన్మించాడు. దీనికి సంబంధించి రాజకుటుంబంతో పాటు దేశమంతా చాలా సంతోషంగా ఉన్నాం అంటూ రాయల్ ప్యాలెస్ నుంచి ప్రకటన వెలువడింది. భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగ్యేల్ వాంగ్ చుక్, జెట్సన్ ను ప్రేమించి, 2011లో పెళ్లి చేసుకున్నాడు. కాగా యువరాజుకు ఇంకా పేరును ప్రకటించలేదు.