‘బందిపోటు’ సమీక్ష (క్లుప్తంగా)



తారాగణం: ‘అల్లరి’ నరేష్, ఈషా, పోసాని, రావు రమేష్, తనికెళ్ళ భరణి, సంపు, దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి, నిర్మాతలు: రాజేష్ - నరేష్, సంగీతం: కళ్యాణి మాలిక్.

ప్రతిభావంతుడైన దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ‘అల్లరి’ నరేష్ హీరోగా నటించిన ‘బందిపోటు’ శుక్రవారం నాడు విడుదలైంది.  ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ కలసి నిర్మించిన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.

అల్లరి చిల్లరగా తిరుగుతూ చిల్లర దొంగనాలు చేసే హీరోని విలన్ల మీదకు హీరోయిన్ ప్రయోగించడం ఈ సినిమా ప్రధాన కథాంశం. ‘ఊసరవెల్లి’ సినిమా గుర్తొస్తోందా? సరే, చిల్లర దొంగతనాలు చేసే అల్లరి నరేష్‌ని హీరోయిన్ ఈషా తన తండ్రిని మోసం చేసిన రావు రమేష్, భరణి, పోసాని మీదకి ప్రయోగిస్తుంది. ఈ క్రమంలో హీరో హీరోయిన్లు ఒకరితో ఒకరు ప్రేమలో పడిపోతారు. ఆ తర్వాత హీరో విలన్లకు ఎలా బుద్ధి చెప్పాడనేది ఈ సినిమా కథ.

టైటిల్స్ పడినప్పటి నుంచి శుభం కార్డు పడే వరకూ ప్రేక్షకులను నాన్‌స్టాప్‌గా కిలకిలా నవ్వించాలన్న సదుద్దేశంతో తీసిన ఈ సినిమా లక్ష్యాన్ని చేరలేదు. మొదటి నుంచి చివరి వరకూ ఎక్కడా సరిగా నవ్వించలేదు కదా ఏడుపు తెచ్చే పరిస్థితి వుంది. సినిమా పరిస్థితేం బాలేదు. తర్వాత మీ ఇష్టం.