హిందూపూర్ బరిలో బాలకృష్ణ?

 

 

 

నందమూరి బాలకృష్ణ ‘లెజెండ్’ విజయ యాత్ర ముగిసింది. పనిలోపనిగా జరిపిన ‘తీర్థయాత్ర’ కూడా ముగిసింది. పాత ఫీల్డులో విజయాన్ని ఇచ్చినందుకు, కొత్త ఫీల్డులోకి ఎంటర్ కాబోతున్నందున ఆశీర్వాదాలు కోరుకుంటూ బాలకృష్ణ పనిలోపనిగా ప్రసిద్ధ దేవాలయాలను కూడా సందర్శించారు. అనంతపురం జిల్లాలో బాలకృష్ణ పర్యటన ముగిసింది.

 

ఈ సందర్భంగా కార్యకర్తలతో సమావేశమైన బాలకృష్ణ తాను హిందూపురం శాసనసభ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా వున్నట్టు వెల్లడించినట్టు సమాచారం. ఇప్పటి నుంచే కార్యకర్తలు, అభిమానులు హిందూపూర్‌లో తన ప్రచారానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ చేయాల్సిందిగా సూచించినట్టు తెలుస్తోంది.



హిందూపురం అసెంబ్లీ నుంచి బాలకృష్ణ పోటీచేయాలనుకోవడం స్థానిక తెలుగుదేశం నాయకులలో సంతోషాన్ని కలిగిస్తోంది. ఎన్టీఆర్ కుటుంబానికి హిందూపూర్ అంటే ఉన్న అభిమానాన్ని తలచుకుని అక్కడివారందరూ మురిసిపోతున్నారు. ఎన్టీఆర్ కూడా గతంలో హిందూపూర్ నుంచే పోటీ చేసి ఘన విజయాలు సాధించారు. ఆయన సంప్రదాయాన్ని ఆయన కుమారుడు బాలకృష్ణ కొనసాగిస్తారని భావిస్తున్నారు.