బాలకృష్ణ ముందంజ..9000వేల అధిక్యం

 

 

 

ప్రముఖ నటుడు,టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వియ్యంకుడు బాలకృష్ణ అనంతపురం జిల్లా హిందుపూర్ లో విజయం దిశగా దూసుకుపోతున్నారు.ఆయన తన సమీప వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి నవీన్ నిశ్చల్ పై 9000వేల అధిక్యంలో వున్నారు.హిందూపురం నందమూరి వంశానికి పెట్టని కోటలా వుంది. ఎన్టీఆర్ కూడా అక్కడి నుంచి పోటీ చేసి విజయాలు సాధించారు. ఇప్పుడు ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని బాలకృష్ణ కొనసాగిస్తాన్న నమ్మకం అందరిలోనూ వుంది. ఇప్పుడు ఆ నమ్మకం నిజమవుతోంది. ఇప్పుడు అందరి దృష్టీ బాలకృష్ణ ఎంతటి సంచలన విజయం సాధిస్తారన్న విషయం మీదే కేంద్రీకృతమై వుంది.