ఎన్టీఆర్ ని ప్రచారానికి రావద్దన్న బాలయ్య..!!

 

టీడీపీ తరుపున నందమూరి హరికృష్ణ తనయ..సుహాసిని కూకట్ పల్లి నుంచి ఎన్నికల బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. ఆమె నామినేషన్ కి బాలయ్య వచ్చారు. సుహాసిని కోసం ఎన్నికల ప్రచారంలో నందమూరి కుటుంబం నుంచి బాలకృష్ణ, తారక్ రామ్, కళ్యాణ్ రామ్ సతీమణి స్వాతి పాల్గొన్నారు. అంతేకాకుండా సుహాసిని మామ, తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. నటుడు జగపతి బాబు కూడా తన మద్దతు సుహాసినికి ప్రకటించారు. ఇదిలా ఉంటే అక్క కోసం ప్రచారానికి వస్తారు అనుకున్న ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ప్రచారంలో పాల్గొనలేదు. మొదట్లో సుహాసిని గెలుపుని కాంక్షిస్తూ ఓ ప్రకటన మాత్రమే విడుదల చేశారు. వాళ్ళు ప్రచారానికి రాకపోవటంపై పలు రకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ అన్ని ఊహాగానాలకు తెరదింపుతూ ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవటానికి గల కారణాన్ని బాలయ్య చెప్పేశారు..


"జీవితంలో రాజకీయాలు వేరు,సినిమాలు వేరు. ఈ విషయాన్ని నేను మా నాన్న స్వర్గీయ తారక రామారావు గారి దగ్గర నేర్చుకున్నాను. ఇక కూకట్ పల్లి నుండి పోటీకి దిగిన సుహాసిని తరుపున ప్రచారానికి జూ.ఎన్టీఆర్ రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జూ.ఎన్టీఆర్ ఇప్పుడిప్పుడే సినీ పరిశ్రమలో అంచలంచలుగా ఎదుగుతూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో జూ.ఎన్టీఆర్ ప్రచారానికి వస్తే కొంత మంది వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. అందులోనూ జూ.ఎన్టీఆర్ కి ప్రచారం అంతగా కలిసి రాలేదు. ఆ భయంతోనే నేను జూ.ఎన్టీఆర్ ప్రచారానికి రావద్దన్నాను. జూ.ఎన్టీఆర్ నా అన్న హరికృష్ణ కొడుకే కాదు..నాకూ కొడుకే. అందుకే ఎన్నికల ప్ర్రచారానికి రానివ్వలేదు. నా కొడుకు మోక్షజ్ఞ ఎందుకు రాలేదో..జూ.ఎన్టీఆర్ కూడా అందుకే రాలేదు. నేను ఇప్పటికే ఎమ్మెల్యే గా ఉన్నాను. సినీ పరిశ్రమలో స్టార్ డమ్ మొత్తం చూశాను. అందుకే రాజకీయాలు, సినిమా రెండు బాలన్స్ చేయగలుగుతున్నాను. రాజకీయాలలో సుహాసినిది, నాది ఒక మార్గం. జూ.ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్, మోక్షజ్ఞ ది ఒక మార్గం. అందుకే మేము వేరు...వాళ్ళు వేరు.." అని జూ.ఎన్టీఆర్ గురించి బాలయ్య వ్యాఖ్యానించారు.