బాలకృష్ణతో చంద్రబాబు రాయబారం

Publish Date:May 16, 2013

 

 

balakrishna chandrababu, chandrababu balayya, hari krishna ntr

 

 

చాలా కాలంగా తన మీద ఆగ్రహంగా ఉన్న హరికృష్ణను బుజ్జగించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందుకు బావమరిది బాలయ్యను చంద్రబాబు సంధికి పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన బావమరిది, హీరో నందమూరి బాలకృష్ణతో భేటీ అయ్యారు. బాలయ్య ఇంటికి వెళ్లిన చంద్రబాబు ఆయనతో రాజకీయ అంశాలపై చర్చించినట్లుగా చెబుతున్నారు. పార్టీ పట్ల, చంద్రబాబు పట్ల అసంతృప్తితో ఉన్న నందమూరి హరికృష్ణను బుజ్జగించే విషయమై వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

 

హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ లు కొన్నాళ్లుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇది పార్టీ చేటు చేస్తుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నుండి గవర్నర్ ను కలిసే కార్యక్రమానికి హరికృష్ణకు ఆహ్వానం అందలేదు. ఎంపీ అయిన తనను విస్మరించడం హరికృష్ణకు మరింత ఆగ్రహం తెప్పించిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు దిద్దుబాటు చర్యలు చేపట్టారని సమాచారం. అయితే హరికృష్ణ, ఎన్టీఆర్ లు ఇద్దరూ బాలయ్య మీద కూడా ఆగ్రహంగా ఉన్న నేపథ్యంలో రాజీ చర్చలు ఫలిస్తాయా ? లేదో.