నిమ్మగ‌డ్డకు తాత్కాలిక బెయిల్‌

 

జ‌గ‌న్ అక్రమాస్తుల కేసులో చంచ‌ల్ కూడా జైలులో రిమాండ్ ఖైదిగా ఉన్న ప్రముఖ పారిశ్రామిక వేత్త నిమ్మగ‌డ్డ ప్రసాద్‌కు బెయిల్ ల‌భించింది.వ్యక్తి గ‌త కార‌ణాల‌తో బెయిల్ కావాలంటూ నిమ్మగ‌డ్డ పెట్టుకున్న పిటిష‌న్ పై విచారించిన సిబిఐ కోర్టు 2 రోజుల పాటు తాత్కాలిక బెయిలును మంజూరు చేసింది. నిమ్మగ‌డ్డ బెయిలుకు సంభందించిన మంగ‌ళ వారం విచారించిన కోర్టు ఈ మేర‌కు ఉత్తర్వులు ఇచ్చింది.

ఇదే కేసులో జైళులో ఉన్న మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ బెయిల్ పిటిష‌న్ విచార‌ణ‌ను ఈ నెల 12కు వాయిదా వేసిన కోర్టు, మోపిదేవి ఆరోగ్య ప‌రిస్థితిపై నివేదిక ఇవ్వాల‌ని మెడిక‌ల్ బోర్డును ఆదేశించింది.