మీ శ్వాస మీ అనారోగ్యం గురించి చెపుతుంది

మీరు ఒక వేళ వివిధ రకాల దుర్వాసన ను పీలుస్తున్నారా? అయితే అది మీరు తిన్న ఆహారమే కావచ్చు. ఉల్లి పాయ, లేదా వెల్లులి పాయలుకొందరికి 
తినడం అలవాటు. లేదా ఇతర ఆహారం ఏదైనా దుర్గంధ మైన శ్వాసకు కారణం కావచ్చు.

గురక...

అసలు నోటి దుర్వాసన లేదా నోటి దుర్వాసనకు కారణాలు ఏమిటి?అన్న ప్రశ్నకు చాలా కారణాలు ఉన్నాయని అంటున్నారు. నిపుణులు మీకు గురక వచ్చిందంటే అది మీ గొంతులో అయ్యి ఉండవచ్చు. మీ గురక వల్ల నోటిని గొంతుని ఎండిపోయేలా చేస్తుంది. దీనివల్ల మీ నోటిలో లాలా జలం 
ఉత్పత్తి జరగదు. అలా జరిగి నప్పుడు బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.దీని వల్లె దుర్వాసనకు కారణం అని చెప్పవచ్చు. బోర్లా పడుకోవడం వల్ల కూడా గురకకు కారణం గా చెప్పవచ్చు.

 చిగుళ్ళలో వ్యాధులు...

ఇక్కడ ఒక విషయం చెప్పాలి మన నోరే అన్ని అనారోగ్యలకి రహదారి అంటున్నారు వైద్యులు. ఇది నిజం నోటి దుర్వాసనకు ముఖ్యమైన కారణం మనం తీసుకునే ఆహారం. అసలు ఉదయం లేస్తూనే మొదట దంతావదానం అదేనండి పళ్ళు శుభ్రంగా కడుకోడ్డం నిత్య కృత్యం. చిన్నప్పటి నుంచి నోటిని పరిశుభ్రమగా రుద్దుకుని కడుక్కోడం లో ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా పళ్ళు మాత్రమే కాదు చిగుళ్ళు కూడా శుభ్రంగా కడుక్కోవాలి  అలా చేయ కుండా మీరు రాత్గ్రి ఆహారం తీసుకున్నాక నోటిని శుభ్రంగా కడుక్కొక పోతే ఆక్రిములు మీ నోటి చిగుళ్ళలో, పంటి సందులలో ఉండిపోయి  పళ్ళు పుచ్చి పోవడం చిగుళ్ళకు  ఇన్ఫెక్షన్ వచ్చి చిగుళ్ళలో వాపు నోటి దుర్వాసనకు దారి తీస్తుందని పంటి వైద్యులు పేర్కొన్నారు. మీరు తీసుకునే ఊపిరి ఒక రాసాయనాల వాసన వస్తుంది. దీనికి కారణం చిగుళ్ళలో బ్యాక్టీరియా బ్యాక్టీరియా చిగుళ్ళు పలు వరుసలో వాచి ఉంటాయి. దీనికి కారణం చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ ముఖ్యంగా ఎవరైతే ఎక్కువగా పోగతాగుతారో పళ్ళు శుభ్రంగా ఉంచుకోరో వారికి మాత్రమే చిగుళ్ళలో సమస్యలు వస్తాయి.

.యాసిడ్ రిఫ్లక్స్...

యాసిడ్ రిఫ్లక్స్ ఒక స్థితి ఇందులో పొట్టలో ఉండే యాసిడ్ రసాయనాలు ఇసో ఫెగస్ పైకి రసాయనాలు ఎగతంతాయి. దీని వల్ల నోటి దుర్వాసన కు కారణం కావచ్చు. ఇందులో పుల్లటి రసాయనం లేదా తిన్న ఆహారం గొంతులోకి రావచ్చు. రసాయనం వల్ల మీ నోరు గొంతు పాడైపోతుంది.

డయాబెటీస్...

మీరు డయాబెటీస్ వల్ల నోటి దుర్వాన వచ్చే అవకాశం ఉంది మీ శరీరం తయారు చేసే కీ టోన్స్ విడుదల చేస్తుంది. గ్లూకోజ్ కి బదులు కీటోన్స్ విడుదల చేస్తుంది. డయాబెటీస్ ఉంటె నోటి దుర్వాసన రావచ్చు. ఇన్సులిన్ తకువగా ఉన్న నోటి దుర్వాసన రావచ్చు.

హెచ్ ఫై లోరీ...

హెచ్ పైలోరి ఒక బ్యాక్టీరియా అది మీనోటిలో పుళ్ళు లేదా అల్సర్స్ కు కారణం అవుతుంది.లేదా పొట్టలో క్యాన్సర్ కు కారణం అవుతుంది. దీని వల్ల నోటి దుర్వాసన, గుండెల్లో మంట, అసహనం, గ్యాస్ వల్ల వచ్చే నొప్పి ఆహారం అరగక పోవడం దీనివల్ల నోటిలో దుర్వాసన వస్తుంది మీ నోటిలో వచ్చే ఇన్ఫెక్షన్లను డాక్టర్లు పరీక్షించి దీనికి యాంటి బాయిటిక్స్ చికిత్చ చేస్తారు. 

శ్వాస సంబందిత ఇన్ఫెక్షన్లు...

సైనస్, సైనో సైటిస్, బ్రోన్ కైటిస్, జలుబు,దగ్గు, మరిన్ని శ్వాసకొస సంబంధిత ఇన్ఫెక్షన్లు అంటే శరీరంలో పూర్తిగా బ్యాక్టీరియా తో నిండి ఉంటుంది. ముక్కులో మ్యుకస్, నోటిలో అల్సర్స్ నోటిదుర్వాసనకు కారణం కావచ్చు.

మందులు...

ఎదో ఒక అనారోగ్యంతో దీర్ఘ కాలంగా మందులు వాడే అలవాటు ఉంటుంది అయితే దీని వల్ల గొంతు ఎండిపోయినట్లుగా ఉంటుంది. నోటిలో లాలాజలం  ఊరకుండా పోతుంది దీనివల్ల బ్యాక్టీరియా పెరిగి దుర్వాసన వస్తుంది. గుండె కోసం వాడే మందులు, నైట్రేట్లు, వల్ల నోటి దుర్వాసన రావచ్చు. లేదా నిద్ర మాత్రలు, కీమో తెరఫీ, విటమిన్ల వాడకం వల్ల నోటి దుర్వసనకు కారణం కావచ్చు.

గొంతులో టాన్సల్స్...

టాన్సల్స్ లిం ఫాటిక్ విధానంలో టాన్సల్స్ అత్యంత కీలక భూమిక పోషిస్తాయి. గొంతు వెనుక భాగం లో ఇవి ఉంటాయి. మీరు తిన్న ఆహారం గొంతు వెనుక భాగం లో లోకి చేరి గొంతులో అడ్డు కుంటూ ఉంటాయి. అవి రాళ్ళలా ఏర్పడతాయి.వాటి చుట్టూ కాల్షియం,  బ్యాక్టీరియా ఏర్పడి టాన్సిల్ రాళ్ళలా ఏర్పడతాయి. దీనివల్ల మీ శ్వాస నోటి దుర్వాసనకు కారణం అవుతుంది.కొంత మంది టాన్సల్ ద్వారా ఏర్పడే రాళ్ళను తొలగించేందుకు టూత్ బ్రష్ లు, కాటన్ స్వాప్ లు, వాడతారు. లేదా వేడి నీళ్ళలో గార్లింగ్ చేస్తూ ఉంటారు. పుక్కిలించి ఉమ్మి వేస్తూ ఉంటారు. అలా టాన్సల్ పెరిగితే వాటిని తొలగించేందుకు డాక్టర్లు ప్రయత్నం చేస్తారు.

డీ హైడ్రేషన్...

నోటి దుర్వాసన లేదా దుర్గంద మైన శ్వాసను ఎలా నిరోదించ వచ్చు. అని ఆశ్చర్య పోతున్నారా ఎక్కువ నీరు తాగుతూ ఉండండి. డీహైడ్రేషన్ వల్ల సలైవా ఉత్పత్తి తగ్గుతుంది.సలైవా వల్ల బ్యాక్త్రీరియా పెరుగుతుంది. దీనివల్ల ఒక్కోసారి నోరు ఎండి పోతుంది. దీనివల్ల సాల్పెర్లీ గ్లాండ్స్ పై ప్రభావం చూపుతుంది. ఈ కారణం గానే నోరు ఎండి పోయి నోటి దుర్వాసన వస్తుంది.

ఇన్ఫెక్షన్లు...

నోటిలో సహజంగా కొన్ని రకాల ఇంజురీస్ జరగడం వల్ల నోటి దుర్వాసన వస్తుంది. దీని వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్ట్ అవుతుంది.నోటిలో గాయాలు లేదా చిన్న చిన్న కురుపులు లేదా ఒక ప్రమాదం వల్ల జరగచ్చు.లేదా మీ నోటిలో ఓరల్ సర్జరీ లేదా మీ చిగుళ్ళలో సమస్యలు లేదా మీ నోటిలో పళ్ళు తొలగించినప్పుడు మీ పక్కనే ఉన్న మరోదంతం ఇన్ఫెక్షన్ కు గురికావచ్చు. ఈ సమయంలో మీ దంత వైద్యులు ఓరల్ సర్జన్ ఇచ్చే సూచనలు క్రమం తప్పకుండా పాటించండి.పంటికి సంబందించిన వివిధ పద్దతులు అవలంబించిన తరువాత ఏదైనా మీ పంటికి సమస్య  వస్తే లేదా ఇన్ఫెక్షన్ వచ్చినా మీ డాక్టర్ యాంటీ బాయిటిక్స్ చికిత్స చేస్తారు. ఉప్పు నీటితో పుక్కిలించి ఉమ్మివేయడం ద్వారా మీ నోరు ఎప్పటి కప్పుడు శుభ్రంగా ఉంటుంది. బ్యాక్టీరియా నుండి దూరంగా ఉంచు తుంది.

లివర్ ఫెయిల్ అయితే...

లివర్ ఫెయిల్ అయితే నోటి దుర్వాసన వస్తుంది. లివర్ ఫెయిల్ల్యూర్ హేప టైకస్ చాలా తీయగా ఉంటుంది. ఇలా ఉండడానికి కారణం లివర్ వ్యాధి వచ్చినందుకే అని నిపుణులు తేల్చారు. లేదా కళ్ళు పచ్చగా ఉండడం కంటికి పచ్చ కామెర్లు వచ్చాయని అంటారు. లేదా వైద్య పరిభాషలో జాండీస్ వచ్చిందని అంటారు. రక్తంలో బిల్ రూబిన్ పెరిగి నప్పుడు ఈ సమస్య వస్తుంది. 

కిడ్నీ సమస్యలు

కిడ్నీలో సమస్యలు వస్తే చాపల ఖంపు కొడుతుంది కిడ్నీ సైజు తగ్గి నప్పుడు ,లేదా కిడ్నీ ఫిల్టర్ చేసే శక్తి తగ్గి నప్పుడు,కిడ్నీ ఫేయిల్యుర్ చివరి క్షణం లో రినాల్ద్ డిసీజ్, కిడ్నీ ఫెయిల్అయ్యింది అంటే డయాలసిస్ చేయడం ద్వారా రక్తశుద్ధి చేయవచ్చు. మీ శ్వాస మీ అనారోగ్యాన్ని గురించి చెపుతుంది. సో టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్.