నోటి దుర్వాసన పోవాలంటే

 

ఎవరితోనైనా మాట్లాడుతుంటే మన నోటిలోంచి దుర్వాసన ఏమైనా వస్తోందా...... ఇది సహజంగా ఎంతో మంది మనసులో మెదిలే మాట. ఇలాంటి భయం లేకుండా హాయిగా తనివితీరా మాట్లాడాలంటే మనం కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదంటున్నారు దంత వైద్యులు. అది కూడా ఇంట్లో దొరికే వస్తువులతో ఈ భయాన్ని పోగొట్టొచ్చట.


*  బ్రష్ వాడటం మొదలుపెట్టక ఎన్నో రోజుల తర్వాత గాని ఆ బ్రష్ ని మార్చరు చాలామంది. అలాంటివాళ్ళు ఎక్కువగా ఈ సమస్యని ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఎలాంటి బ్రష్ అయిన నెల రోజులు వాడాకా కచ్చితంగా మార్చాలని చెప్తున్నారు ఈ వైద్యులు.

*  వారానికి ఒకసారి బకింగ్ సోడాతో పళ్ళు తోముకుంటే పళ్ళల్లో  ఉన్న క్రిములు పోయి నోటి దుర్వాసన దూరమవుతుంది.

*   మౌత్ వాష్ వాడితే గనక అందులో dyes మరియు ఆల్కహాల్ లేకుండా చూసుకోవాలి.

*  ప్రతిసారి భోజనం అయిన తర్వాత వెంటనే మరిచిపోకుండా బ్రష్ చేసుకోవాలిట. ఇలా చేస్తే పళ్ళ మధ్య ఉండే ఆహారపదార్థాలు బయటకి పోయి బాక్టీరియా ఏర్పడకుండా ఉంటుంది.

*  సన్ ఫ్లవర్ సీడ్స్ నమిలి ఒక గ్లాసు నీళ్ళు తాగితే నోటి దుర్వాసన పోతుంది.

*  ఆపిల్ క్రమం తప్పకుండా తింటుంటే ఈ సమస్య దూరమవుతుంది. అది నోట్లో ఉన్న బాక్టీరియా ని తొలగిస్తుంది.

 

 

*  అవకాశం  ఉన్న వాళ్ళు  గోరు  వెచ్చటి నీళ్ళల్లో నిమ్మరసం గాని,బేకింగ్ సోడా గాని వేసి ఆ నీళ్ళు పుక్కలిస్తే నోటి దుర్వాసన పోతుంది.

*  వేపపుల్లతో పళ్ళు తోముకుంటే కూడా నోరు ఫ్రెష్ గా అనిపిస్తుంది.

*   పుదీనా ఆకులు కొన్ని తీసుకుని నమిలినా నోరు తాజాగా అనిపిస్తుంది.

*  అన్నిటికన్నా ముఖ్యమైనది ఎక్కువగా నీళ్ళు తాగటం. నీరు ఎక్కువ శాతం తీసుకోవటం వల్ల నోటిలోని బేక్టీరియా చేరకుండా నోరు ఫ్రెష్ గా ఉంటుంది.

 

 పూర్వకాలంలో వాళ్ళు రోజూ వేపపుల్లతో పళ్ళు తోముకుని, చెరుకుగడలు, గతి వస్తువులు తినటం వల్ల వాళ్ళ పళ్ళు గట్టిగా ఉండేవి. ఈ రోజుల్లో అలాంటివి చేయకపోవటం వల్ల ఇలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. మనకి వీలయినపుడు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు నోటి దుర్వాసన మన జోలికి రాదు.

- కళ్యాణి