హరీష్‌రావు వల్లే టీఆర్ఎస్ బతికుంది

 

కేసీఆర్ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పుడు అందోల్ టికెట్ ఇవ్వకపోవటంతో బాబు మోహన్ బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.టీఆర్ఎస్ అందోల్ టికెట్ ను స్థానిక నేత క్రాంతి కిరణ్ కి కేటాయించింది.సంగారెడ్డిలో ఈ రోజు మీడియాతో మాట్లాడిన బాబు మోహన్ టీఆర్ఎస్ పార్టీ అందోల్ టికెట్ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన తనను సంప్రదించకుండా మరో వ్యక్తికి టిక్కెట్‌ కేటాయించి కేసీఆర్‌ తనను మోసం చేశారని కన్నీరు మున్నీరయ్యారు.సంగారెడ్డిలో భాజపా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న తనను కాదని స్థానికుడి పేరుతో వేరొకరికి టిక్కెట్‌ కేటాయించడంతో దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు.తాను రాజకీయాల్లోకి వచ్చింది కేసీఆర్‌ వల్లేనని,ఆయన్ని గాడ్‌ఫాదర్‌గా భావిస్తానన్నారు.అలాంటి వ్యక్తి తనను నడిరోడ్డుపై వదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్‌లో ఏ రాయి ఎటునుంచి వచ్చినా హరీష్‌‌రావుకే తగులుతుందన్నారు.హరీష్‌రావు వల్లే టీఆర్ఎస్ బతికుందని చెప్పుకొచ్చారు.కాబోయే సీఎం మాత్రం కేటీఆరేనని వివరించారు.అందోల్ టీఆర్ఎస్ అభ్యర్థి క్రాంతి కిరణ్ ఓ బ్రోకర్‌ అంటూ బాబుమోహన్ మండిపడ్డారు.టిక్కెట్‌ కోసం ఫాంహౌస్‌, ప్రగతిభవన్‌ చుట్టూ తిరగలేదన్నారు.తన సేవలను గుర్తించిన భాజపా పార్టీలోకి ఆహ్వానించిందని అందుకే ఆ పార్టీలో చేరానన్నారు.భాజపా నుంచి ఆంధోల్‌లో పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు.బీసీ,ఎస్సీలకు కేసీఆర్ ఏంలాభం చేశారని ప్రశ్నించారు.బీసీ, దళితులను ఆదరించిన పార్టీ బీజేపీయేనని,దళితున్ని రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీదే అన్నారు. మళ్లీ నరేంద్ర మోడీయే ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.