అయోధ్యలో రామ మందిర నిర్మాణం పనులకు శ్రీకారం...

అయోధ్య కేసు అయిపోయినప్పటినుంచి అందరి ధ్యాస మందిర నిర్మాణం పైనే ఉంది. హిందువులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. అయోధ్యలో రామమందిర నిర్మాణ తేదీలు వచ్చేశాయి. ఆలయం నిర్మాణం ఎలా చేపడతారన్న విషయాలను బయట పెట్టింది. ఆలయం నిర్మించేందుకు, ప్రజలను భాగస్వాములను చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మొత్తం మీద అయోధ్య రామ మందిరం నిర్మాణం ప్రారంభానికి శ్రీకారం చుట్టింది. మార్చి 25 నుంచి ఏప్రిల్ రెండో తేదీ లోగా ఈ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. మందిర నిర్మాణ కమిటీ లో 11 మంది విశ్వ హిందూ పరిషత్ నేతలతో పాటు పలు సంస్థల ప్రతి నిధులు కూడా ఉన్నారని సమాచారం.

మరోవైపు మందిర నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు సేకరించనున్నారు. ప్రజల భాగస్వామ్యంతో మందిరం నిర్మించాలని తలపెట్టారు. ప్రభుత్వాల నుంచి కాకుండా దేశం నలుమూలల్లో ఉన్న ప్రజల నుంచి విరాళాలు సేకరించాలని కూడా నిర్ణయించారు. ఇందు కోసం ప్రత్యేకంగా బ్యాంక్ ఎకౌంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచారం. మొత్తానికి అయోధ్యలో రామ మందిరం నిర్మాణ పనులకు తేదీలు రావడం పట్ల హిందువులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.