అర్ధరాత్రి నుంచి ఆటోలు బంద్‌

 

ట్రాఫిక్ చ‌లానాల భారీగా పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిర‌సిస్తూ ఆటో యూనియ‌న్‌లు ఆటోల బంద్ కు పిలుపునిచ్చాయి. ఆటో పార్కింగ్ స‌మ‌స్యకు ఎలాంటి ప‌రిష్కారం చూపించ‌కుండానే ట్రాపిక్ ఉల్లంఘ‌న‌కు జ‌రిమానాను ఏక‌ప‌క్షంగా వేయి రూపాయ‌ల‌కు పెంచుతూ ట్రాపిక్ పోలీస్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని తెలంగాణ ఆటో డ్రైవ‌ర్స్ జేఏసి ఖండించింది. దీనికి వ్యతిరేకంగా ఆదివారం అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటో బంద్ పాటిస్తున్నట్టు జేఏసీ కన్వీనర్ మహ్మద్ అమానుల్లాఖాన్ తెలిపారు.

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం లక్షలాది మంది ఆటోడ్రైవర్లను ఇబ్బందులకు గురి చేస్తుంద‌ని చెప్పారు. సిగ్నల్ జంపిగ్ లాంటి వాటికి చ‌లానాలు రాస్తున్న ప్రభుత్వం 20కిపైగా కూడ‌ళ్లలో సిగ్నల్స్ ప‌నిచేయ‌టం లేద‌ని ప్రభుత్నానికి తెలియ‌దా అని చెప్పాడు. అమిత్‌గార్గ్ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపిం చారు.

నగరంలో ఆటోల‌కు పార్కింగ్ ఏర్పాటు చేసే వ‌ర‌కు చ‌లాన్లను పెంచ‌వద్దని కోరారు.అలా చేయ‌ని ప‌క్షంలో నిర‌వ‌దిక స‌మ్మెకు దిగుతామ‌ని హెచ్చరించారు.  న్యాయపరమైన డిమాం డ్లను అంగీకరించే వరకూ సమ్మెను కొనసాగించాలని ఆటో డ్రైవర్లకు సూచించారు.