మీ అభయాలు ఎవడిక్కావాలి?

 

 

 

ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిపోయిందో అప్పటి నుంచి ప్రతి వాడికీ సీమాంధ్రులంటే చులకనైపోయింది. రాష్ట్రాన్ని విభజిస్తూ వుంటే వీళ్ళు చవట దద్దమ్మల్లా ఏమీ చేయలేకపోయారన్న ఫీలింగ్ తెలంగాణ వాదుల్లో బాగా వుంది. ఇది సీమాంధ్రులకు బాగా మండేలా చేస్తోంది. దీనికి తోడు తెలంగాణలో, హైదరాబాద్‌లో వున్న సీమాంధ్రులను కడుపులో పెట్టి చూసుకుంటాం... గుండెల్లో దాచుకుంటాం లాంటి స్టేట్‌మెంట్లు తెలంగాణ వాదులు ఇవ్వడం చూస్తే సీమాంధ్రులకు ఎక్కడ మండకూడదో అక్కడ మండుతోంది.

 

ఒక్కొకడు మరీ తెలివిగా స్టేట్‌మెంట్ ఇస్తూ వుంటాడు. హైదరాబాద్‌లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. సీమాంధ్రులు కూడా వుండొచ్చు అని ఒకడు అనుమతి ఇస్తాడు. ఇంకోడు సీమాంధ్రులు హైదరాబాద్‌లో వుండొచ్చు పర్లేదని జాలి చూపిస్తాడు. ఇలాంటివన్నీ వింటున్న సీమాంధ్రులు మీ సానుభూతి వచనాలు ఆపండ్రా అని అరవాలని అనుకున్నా. పట్టించుకునేవాడెవడూ లేడని ఊరుకుంటున్నారు. సరే, ఇప్పుడింతకీ ఈ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ వేశాడు.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ  ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని చెప్పాడు. ఇంకా తమ పార్టీ గురించి ఏవేవో చెప్పుకున్నాడు. అంతవరకూ ఓకే.. పక్కా తెలంగాణ వాదుల మాదిరిగా ఈయన కూడా హైదరాబాద్‌లో సీమాంధ్రులు ఎంతమాత్రం భయపడక్కర్లేదు. సీమాంధ్రులకు అండగా నేనుంటా అని అభయం ఇచ్చేశాడు. అసలు హైదరాబాద్‌లో వున్న సీమాంధ్రులు ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? సీమాంధ్రుల కాలిగోటినైనా కదిలించే దమ్ము ఎవరికుంది? టోటల్‌గా చెప్పాలంటే, ఎవరి సానుభూతి అయినా సీమాంధ్రులు అడిగారా? కాపాడమని ఆక్రోశించారా? అంచేత ఇక ఆపండి.. మీ అభయాలు ఎవడికీ అక్కర్లేదు.