పార్టీ పదవికి కేజ్రీవాల్ రాజీనామా

 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. గత కొద్ది రోజులుగా ఆమ్ ఆద్మీ పార్టీలో అంతర్గత విభేదాలు బాగా ముదిరిపోయాయి. ఈ విభేదాల వల్ల ఢిల్లీ ప్రజల దృష్టిలో మనం, మనపార్టీ చులకనైపోతుందని కేజ్రీవాల్ ఎంత మొత్తుకుంటున్నప్పటికీ ఆయన మాటను పార్టీ నాయకులు పట్టించుకోవడం లేదు. అసలే అనారోగ్యంతో బాధపడుతున్న కేజ్రీవాల్ బెంగుళూరులోని ప్రకృతి చికిత్సాలయానికి ట్రీట్‌మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఆయన్ని అనారోగ్యం కంటే పార్టీలో వున్న అంతర్గత విభేదాలు ఎక్కువగా బాధిస్తున్నాయి. ఆ బాధ పెరిగిపోవడంతో ఆయన ఆప్ కన్వీనర్ పదవికి రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఆయన తన రాజీనామా లేఖను ఆప్ జాతీయ కౌన్సిల్‌కి పంపించారు. అయితే ఆయన తన రాజీనామాకు కారణం పార్టీలోని అంతర్గత విభేదాలని చెప్పడం లేదు. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి మరింత ఏకాగ్రతతో న్యాయం చేసేందుకే తాను రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు.