కేజ్రీవాల్ గూబ గుయ్యిమంది

 

 

 

కేజ్రీవాల్‌కి బ్యాడ్ టైమ్ నడుస్తున్నట్టు వుంది.మొన్నామధ్య ఆయనగారు ఓ మీటింగ్‌కి వెళ్తే ఒక వ్యక్తి ముఖమంతా ఇంకుపోసి ఇన్‌సల్ట్ చేశాడు. నిన్నగాక మొన్న కేజ్రీవాల్‌ని ఒక వ్యక్తి మెడమీద లాగిపెట్టి కొట్టాడు. లేటెస్ట్ గా కేజ్రీవాల్ గూబ గుయ్యిమంది. ఢిల్లీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కేజ్రీవాల్‌ మీద ఒక వ్యక్తి దాడి చేసి గూబ గుయ్యిమనిపించాడు. అకస్మాత్తుగా చెంప చెళ్లుమనేసరికి కేజ్రీవాల్ బిత్తరపోయాడు. కేజ్రీవాల్‌ మీద చెయ్యి చేసుకున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నాడు.