‘ఆప్’ నుంచి తరిమేశారు...

 

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఢిల్లీలో భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే ఆయన మనశ్శాంతిగా మాత్రం లేరు. ఎందుకంటే ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలు. వీటి పుణ్యమా అని పార్టీ పదవుల మీద విరక్తి పుట్టుకొచ్చిన కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కార్గవర్గ సమావేశం బుధవారం జరిగింది. పార్టీలో కుమ్ములాటలకు కారణమైన యోగేంద్ యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లను పార్టీ పదవుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా పార్టీ కన్వీనర్ పదవికి అరవింద్ కేజ్రీవాల్ చేసిన రాజీనామాను కూడా పార్టీ జాతీయ కార్యవర్గం తిరస్కరించింది.